Breaking News

ఆ డైట్‌ చాలా సవాల్‌గా అనిపించింది: శ్రీ మురళి

Published on Wed, 10/23/2024 - 03:06

‘‘మా అత్తగారిది నెల్లూరు. ఇంట్లో నా భార్య, అత్తగారు తెలుగే మాట్లాడతారు... అందుకే నాకు కూడా తెలుగు వస్తుంది. తెలుగులో విడుదలవుతున్న నా మొదటి సినిమా ‘బఘీర’. దేశమంతా చూడదగ్గ మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూ΄పొందిన చిత్రమిది. అందుకే తెలుగులోనూ రిలీజ్‌ చేస్తున్నాం’’ అని కన్నడ హీరో శ్రీమురళి అన్నారు. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కథ అందించిన చిత్రం ‘బఘీర’. డా. సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘ఉగ్రం’ ఫేమ్‌ శ్రీ మురళి, రుక్షిణీ వసంత్‌ జంటగా నటించారు. 

హోంబలే ఫిలింస్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ కన్నడ సినిమాని ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా ‘బఘీర’ విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ మురళి మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్‌ నీల్‌గారి కథని సూరిగారు వంద శాతం అద్భుతంగా స్క్రీన్‌ మీదకు తీసుకొచ్చారు. ‘బఘీర’ వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్‌. ఈ సినిమా షూటింగ్‌లో నాకు గాయాలైనా పట్టించుకోలేదు. నాకు నా సినిమానే ముఖ్యం. నేను ఫుడ్‌ లవర్‌ని. ఈ సినిమా కోసం మూడేళ్లు లిక్విడ్‌ డైట్‌ చేశాను. అది చాలా సవాల్‌గా అనిపించింది. ‘ఉగ్రం 2’ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను’’ అని తెలిపారు.  

Videos

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)