Breaking News

రేణూ దేశాయ్ కీలక పాత్రలో ‘బ్యాడ్‌ గాళ్స్‌’.. అమ్మోరులా అమ్మాయిలు!

Published on Thu, 08/07/2025 - 09:22

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ ఫేమ్‌ మున్నా ధులిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బ్యాడ్‌ గాళ్స్‌’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్‌ లైన్‌. అంచల్‌ గౌడ, పాయల్‌ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో రేణూ దేశాయ్, రోహన్‌ సూర్య, మొయిన్‌ కీలక పాత్రధారులు. శశిధర్‌ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్‌  నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రం టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో డైరెక్టర్‌ చందు మొండేటి మాట్లాడుతూ – ‘‘బ్యాడ్‌ గాళ్స్‌’లోని నటీనటులు, సాంకేతిక నిపుణులు నాకు పరిచయం ఉన్నవాళ్లే. ఈ మూవీ పెద్ద హిట్టవ్వాలి’’ అని కోరారు. ‘‘నా మిత్రుడు మున్నా కష్టానికి తగ్గ ఫలితం రావాలి’’ అన్నారు కృష్ణ చైతన్య. ‘‘నలుగురు కొత్త అమ్మాయిలను పెట్టి సినిమా చేయడం సాహసమే’’ అని శివ నిర్వాణ చెప్పారు. 

‘‘అమ్మాయిలకు పెళ్లికి ముందు ఉండే స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదు. అలాంటి చాలామంది కథల స్ఫూర్తితో ఈ సినిమా తీశాను. అమ్మాయిలను భయంతో కాదు ధైర్యంగా ఓ అమ్మోరులా పెంచాలి’’ అని మున్నా చెప్పారు. ‘‘కుటుంబంతో సహా ప్రేక్షకులు మా సినిమాని చూసి ఎంజాయ్‌ చేయాలని కోరుతున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)