Breaking News

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌.. అది మన చేతుల్లోనే ఉంది: నటి

Published on Tue, 07/30/2024 - 19:18

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ అనే పదం తరచుగా వినిపిస్తూనే ఉంటోంది. ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవం ఎదురైన వారు ఇండస్ట్రీలో చాలామందే ఉంటారు. ఇలాంటి చేదు అనుభవాలను అందరూ ధైర్యంగా బయటికి చెప్పలేరు. మరికొందరు తమ కెరీర్‌లో ఎదుర్కొన్న ఇలాంటి సంఘటనలపై ఓపెన్ అవుతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి ఐశ్వర్య సుస్మిత తనకెదురైన  కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మాట్లాడింది. ఇటీవల ఆమె 'బాడ్ కాప్' అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది.

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని ఐశ్వర్య సుస్మిత తెలిపింది. అయితే ఈ విషయాన్ని పెద్దది చేయడం ఒక్కటే మార్గం కాదని ఐశ్వర్య అన్నారు. తాను ఎప్పుడూ ఎలాంటి ఆడిషన్స్‌ను మిస్ చేసుకోలేదని పేర్కొంది. తాను విలువల విషయంలో రాజీ పడేది లేదని.. కష్టపడి పనిచేస్తానని చెప్పుకొచ్చింది.

ఐశ్వర్య మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఇలాంటివీ చాలా విన్నా. చాలామంది వ్యక్తులు పలు విధాలుగా కథలు చెప్పేవారు. నేను అప్పటికీ మోడల్‌గానే ఉన్నా ఇంకా నటనలోకి అడుగు పెట్టలేదు. మీరు వారితో పడుకోకపోతే మీకు అవకాశాలు రావని నాకు చెప్పేవారు. కానీ పరిశ్రమలోకి రావడానికి ఇది ఒక్కటే మార్గం కాదు. కానీ ఆ సమయంలో కొందరు డైరెక్టర్స్‌, క్యాస్టింగ్‌ డైరెక్టర్స్‌ నన్ను పర్సనల్‌గా కలవమని చెప్పేవారు. కానీ ఇక్కడ మనల్ని ఎవరూ బలవంతం చేయడం లేదు. వెళ్లాలా? వద్దా? అనేది మన నిర్ణయం. ఇది కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు.. కార్పొరేట్ రంగంలోనూ ఉంది.' అంటూ తన అనుభవాలను గుర్తు చేసుకుంది.

కాగా.. ఐశ్వర్య సుస్మిత మోడల్‌గా తన కెరీర్‌ని ప్రారంభించింది. 2016లో కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్‌గా తొలిసారి అవకాశం దక్కించుకుంది. ఆమె మోడలింగ్ నుంచి నటన వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి ఓటీటీలో అరంగేట్రం చేసిన ఐశ్వర్య సుస్మిత త్వరలోనే సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధమవుతోంది. 
 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)