Breaking News

బ్యాచిలర్స్‌ కోసం జోరు పెంచిన 'సందీప్‌ కిషన్‌'

Published on Wed, 01/29/2025 - 12:21

సందీప్‌ కిషన్ (Sundeep Kishan)  హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'మజాకా' (Mazaka Movie) నుంచి బ్యాచిలర్స్‌ కోసం అదిరిపోయే సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్‌ పతాకాలపై రాజేష్‌ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 21న విడుదల కానున్న ఈ ప్రాజెక్ట్‌ను మాస్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. 

(ఇదీ చదవండి: 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం.. ప్రియుడిని ప్రకటించిన 'అభినయ')

ఈ చిత్రంలో రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రావు రమేశ్, అన్షు కీలకపాత్రలు పోషించారు. నాగార్జునతో మన్మథుడులో నటించిన అన్షు (Anshu Ambani) చాలా కాలం తర్వాత మజాకా సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. అయితే, తాజాగా విడుదలైన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా ధనుంజయ్‌  ఆలపించారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, సహ–నిర్మాత: బాలాజీ గుత్తా ఉన్నారు.

'మజాకా' సినిమా కోసం సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్‌ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే,  జీ స్టూడియోస్ వారు కేవలం ఓటీటీ హక్కులను 20 కోట్లకు సొంతం చేసుకున్నారని ప్రచారం ఉంది. ఇదే నిజమైతే.. సందీప్ కిషన్ సినిమాకు  భారీ డీల్ సెట్‌ అయినట్లే అని చెప్పవచ్చు. థియేటర్‌ రన్‌లో రూ. 10 కోట్లు రికవరీ చేయడం పెద్ద కష్టమేమి కాదని చెప్పవచ్చు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)