Breaking News

'బేబీ' చూసి సురేఖావాణి కూతురు కన్నీళ్లు!

Published on Thu, 07/20/2023 - 16:18

ఈ మధ్య కాలంలో అందరూ ఓ మూవీ గురించి తెగ మాట్లాడుకున్నారు. స్టిల్ ఇప్పటికీ దాని గురించే డిస్కస్ చేస్తున్నారు. అదే 'బేబీ'. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత‍్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకుని వసూళ్లలో జోరు చూపిస్తోంది. అలానే చాలామందిని ఎమోషనల్ చేస్తోంది. ఇప్పుడు సురేఖావాణి కూతురిది కూడా అదే పరిస్థితి.

'బేబీ' కథ
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిస్థితుల స్పూర్తితో తీసిన 'బేబీ'. కథ విషయానికొస్తే.. బస్తీలో ఉండే ఓ అమ్మాయి స్కూల్‌ చదువుతూ ఎదురింట్లో ఉండే కుర్రాడిని లవ్ చేస్తుంది. పదో క్లాస్ పాస్ అయి, ఈమె కాలేజీకి వెళ్తుంది. మనోడు ఫెయిలై, ఆటో డ్రైవర్ అవుతాడు. ఇంజినీరింగ్  కాలేజీలో జాయిన్ అయిన ఆ అమ‍్మాయి.. అక్కడ మరో అబ్బాయితో రిలేషన్‌లోకి వెళ్తుంది. ఇది ఆటో డ్రైవర్ కుర్రాడికి తెలుస్తుంది. చివరకు ఏమైందనేది 'బేబీ' స్టోరీ.

(ఇదీ చదవండి: ప్రభాస్ ఫస్ట్‌లుక్ డిలీట్.. దానికి భయపడ్డారా?)

అంతలా ఏడ్చాను
ఈ సినిమా చూసిన వాళ్లలో యూత్ చాలామంది 'బేబీ'కి కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే నటి సురేఖా వాణి కూతురు సుప్రీత మూవీ చూసింది. తన అభిప్రాయాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. 'ఏమైన్నా సినిమానా ఇది. ప్రతీ ఒక్కరూ ఏదో ఓ సీన్‌కి కనెక్ట్ అవుతారు. కచ్చితంగా ఇది చెప్పగలను. ఒట‍్టేసి చెబుతున్నా. వైష్ణవి చైతన్య అదరగొట్టేసింది. ఆమెని చూస్తే గర్వంగా ఉంది. ఎంతో ఎమోషనల్ అయ్యాను. ఈ మధ‍్య నేను ఇంతలా ఏడ్చిన సినిమా మరొకటి లేదు' అని సుప్రీత రాసుకొచ్చింది.

'బేబీ' కలెక్షన్స్
సింపుల్ బడ‍్జెట్‌తో తీసిన 'బేబీ' అనుహ్యంగా కలెక్షన్స్ వస్తున్నాయి. తొలిరోజు రూ.7.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈచిత్రం..  ఆరో రోజు కూడా అదే టెంపో కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.43.8 కోట్ల గ్రాస్ వచ్చినట్లు మేకర్స్ ప‍్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఓవైపు వర్షాలు దంచికొడుతున్నా.. వసూళ్లు ఒకేలా వస్తుండటం ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. 

(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)