Breaking News

ఆయన వల్లే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా.. కంటతడి పెట్టుకున్న హీరోయిన్

Published on Thu, 07/13/2023 - 07:43

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం బేబీ. ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్రబృందం నిర్వహించింది.  అయితే ఈ వేడుకకు హాజరైన బేబీ హీరోయిన్  వైష్ణవి ఎమోషనల్ అయ్యారు. వేదికపైనే కంటతడి పెట్టుకున్నారు. డైరెక్టర్ సాయి రాజేశ్ నటిగా తనకు పునర్జన్మనిచ్చారని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా.. ఆమె హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. 

(ఇది చదవండి: అందుకే సింగిల్‌గా ఉంటున్నా..పెళ్లిపై సదా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌)

వైష్ణవి మాట్లాడుతూ..'యూట్యూబ్‌ వీడియోలు చేసుకునే నాకు ‘బేబీ’ సినిమాలో అవకాశమిచ్చారు. నాకన్నా ఎక్కువగా నన్ను నమ్మి ముందుకు నడిపించారు దర్శకుడు రాజేశ్‌. మెయిన్‌ లీడ్‌గా చేయాలనేదే నా లక్ష్యం. కానీ మధ్యలో సహాయ నటిగా చేశా. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారా. ఈ అమ్మాయి యూట్యూబర్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ కాబట్టి సినిమాలో మెయిన్‌ లీడ్‌ చేయలేదని చాలామంది అన్నారు. కానీ బేబీలో ఛాన్స్ రాగానే లీడ్ రోల్ చేయగలనా అని భయపడ్డా. కానీ డైరెక్టర్ రాజేశ్‌ నాకు ధైర్యాన్నిచ్చారు. ఈ విషయంలో నాకు మరో జన్మనిచ్చారు. అందువల్లే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా. నిర్మాత ఎస్‌కేఎన్‌ కూడా నన్ను ఓ బేబీలా చూసుకున్నారు.'కంటతడి పెట్టుకుంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్  దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

(ఇది చదవండి: నయన్ భర్తకు వార‍్నింగ్ ఇచ్చిన షారుక్ ఖాన్!)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)