Breaking News

థూ.. నా బతుకు అంటూ బేబీ డైరెక్టర్‌ ట్వీట్‌, కాసేపటికే డిలీట్‌!

Published on Sun, 08/06/2023 - 13:48

ఎక్కడ చూసినా బేబి ఫీవరే నడుస్తోంది. ఈ సినిమా వచ్చి 20 రోజులు దాటిపోతున్నా ఇప్పటికీ దీని క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. నాలుగో వారం కూడా థియేటర్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇప్పటివరకు రూ.87 కోట్లకు పైగా వసూలు చేసి వంద కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. దీంతో బేబీ టీమ్‌ సక్సెస్‌ టూర్స్‌ చేస్తోంది. అందులో భాగంగా శనివారం నాడు శ్రీకాకుళం పర్యటనకు వెళ్లింది. అక్కడ అభిమానులతో కలిసి సినిమా చూసిన సాయి రాజేశ్‌ ప్రేక్షకుల స్పందన చూసి షాకైపోయాడట! ఈ మేరకు తన అనుభవాన్ని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు.

'బేబీ సినిమాలో ఆనంద్‌ బర్త్‌డే రోజు హర్ష వచ్చి అమ్మాయి క్యారెక్టర్‌ గురించి చెప్తాడు. అప్పుడు ప్రేక్షకులు ఫీలవ్వాలని.. పెద్దగా మ్యూజిక్‌ లేకుండా నిశ్శబ్ధ వాతావారణం ఉండేలా జాగ్రత్తపడ్డాం. హీరో బాధ అర్థం చేసుకుంటారనుకుని బీజీఎమ్‌ మ్యూట్‌ చేసేశా.. కానీ ఈరోజు శ్రీకాకుళంలోని ఓ థియేటర్‌లో వందకు పైగా ప్రేక్షకులు ఆ బాధను ఫీలవ్వాల్సింది పోయి హ్యాపీ బర్త్‌డే ఆనంద్‌ అని అరిచారు. థూ నా బతుకు' అంటూ ట్వీట్‌ చేశాడు. తానొకటి తలిస్తే ప్రేక్షకులు మాత్రం మరోలా రెస్పాండ్‌ అవుతున్నారేంటని అయోమయానికి లోనయ్యాడు డైరెక్టర్‌. ఈ ట్వీట్‌పై ఆనంద్‌ దేవరకొండ ఫన్నీ ఎమోజీలతో రియాక్ట్‌ అయ్యాడు. ఏమైందో ఏమో కానీ కాసేపటికే సాయి రాజేశ్‌ ఈ ట్వీట్‌ డిలీట్‌ చేశాడు.

బేబి విషయానికి వస్తే ఇదొక ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ. ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించగా మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఎస్‌కేఎన్‌ నిర్మించారు. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 14న విడుదలైంది.

చదవండి: పుట్టుకతోనే నా కూతురికి అంత పెద్ద కష్టం.. ఏడ్చేసిన హీరోయిన్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)