Breaking News

ఆ విషయంలో తప్పు నాదే.. బేబీ డైరెక్టర్‌ షాకింగ్ కామెంట్స్!

Published on Sat, 07/22/2023 - 16:17

ఆనంద్‌ దేవరకొండ- వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్‌ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమాకు ఎస్‌కేఎన్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవలే థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. వారం రోజుల్లో ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో చిత్రబృందం ఇటీవలే వేడుకలు కూడా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు.

(ఇది చదవండి: సమంతను ఫాలో అవుతున్న విష్ణుప్రియ.. అసలేంటీ కథ!)

కాగా.. ఈ చిత్రంలో  డైలాగ్స్‌ ప్రేక్షకులను కట్టి పడేశాయి. ముఖ్యంగా ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ మూవీ యువతకు బాగా కనెక్ట్‌ అయ్యింది. ప్రధానంగా యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి ఈ సినిమాలో తన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అయితే ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య పాత్రకు సంబంధించిన డైలాగ్స్‌పై డైరెక్టర్‌ సాయి రాజేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఓ డైలాగ్ విషయంలో మాత్రం తప్పు చేశానన్నారు. అంతే కాకుండా సినిమా రివ్యూలపై సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

సాయి రాజేశ్ మాట్లాడుతూ..  'ఆ అమ్మాయిని వాడు ఎంత హార్ట్‌ చేస్తే కానీ.. అమ్మాయి డివియేట్ అవ్వదు. అంత ప్రేమ ఉన్న వాళ్లద్దరి మధ్య బ్రేక్ రావాలంటే ఆ పదం వాడాల్సిన అవసరమొచ్చింది. 'తెరవాల్సింది కళ్లు కాదు.. కాళ్లు' అనే డైలాగ్ విషయంలో నాది తప్పు.  కానీ ఆ డైలాగ్ వాడాకుండా ఉండాల్సింది.  ఆ డైలాగ్‌కు నేను సారీ చెబుతున్నా. కానీ మిగతా డైలాగ్స్‌ మాత్రం ఈ సినిమాకు ఉండాల్సిందే.' అని ‍అన్నారు. 

ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడంపై మాట్లాడుతూ.. 'ఇప్పటికీ థియేటర్లకు అరవైశాతం ఫ్యామిలీస్‌ కూడా వస్తున్నారు. ఇది సినిమాలో పాత్రలా కాకుండా వారి లైఫ్‌లో జరిగిన సంఘటన భావిస్తున్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మాయిని ఆనంద్ తిడుతుంటే.. దానికి విజిల్స్ పడుతున్నాయి. కానీ ఆనంద్‌ను తిడుతుంటే.. విజిల్స్‌ పడాల్సిన చోట పిన్‌డ్రాప్ సైలెన్స్‌ ఉంది. ఇలాంటివీ కొన్ని నాకు షాక్‌ కలిగించాయి. ఒక అమ్మాయి తప్పు చేసిన విషయం లవర్‌కి తెలిస్తే వయోలెన్స్‌లోకి వెళ్తారు. ఆ ఒక్క యాంగిల్ సోసైటీలోకి వెళ్లకూడదనే పరిస్థితిని తగినట్లు మార్చా. ఆల్కహాల్, సిట్యువేషన్స్‌తో అమ్మాయిని కార్నర్‌ చేసి.. తప్పులు చేయడానికి కారణమైందనే పాయింట్‌ను హైలెట్ చేశా. వైష్ణవి పాత్రను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశా. ' అని అన్నారు. 

(ఇది చదవండి: బేబీ సినిమాకు వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్‌ ఇంత తక్కువనా..?)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)