Breaking News

భోళా ఎఫెక్ట్‌.. ముక్కు పిండి వసూలు చేస్తున్న చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన బేబి డైరెక్టర్‌

Published on Mon, 08/14/2023 - 10:34

అన్ని రీమేక్‌లు వర్కవుట్‌ అవుతాయనుకుంటే పొరపాటే! కొన్ని మంచి విజయాలను అందించినా మరికొన్ని మాత్రం దారుణ అపజయాలను తీసుకొస్తాయి. భోళా శంకర్‌ విషయంలో ఇదే జరిగింది. 2015లో తమిళంలో వచ్చిన వేదాళం మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. వంద కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమాపై డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌ మనసు పారేసుకున్నాడు. చిరంజీవితో తీయాలనుకున్నాడు.

దెబ్బ కొట్టిన జైలర్‌
అక్కడ హిట్టంటే ఇక్కడ కూడా హిట్టే అనుకున్న చిరు వెంటనే ఓకే చేసేశాడు. సినిమా తీశారు. ఆగస్టు 11న బాక్సాఫీస్‌ బరిలో దిగిన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. పైగా అప్పుడే రజనీకాంత్‌ కూడా జైలర్‌ సినిమాతో బరిలోకి దిగడం, ఆ చిత్రానికి హిట్‌ టాక్‌ రావడంతో ఆడియన్స్‌ అంతా అటువైపు మళ్లారు. ఫలితంగా భోళా శంకర్‌ ఫ్లాప్‌ దిశగా అడుగులు వేస్తోంది.

పారితోషికం కోసం పట్టుబట్టిన చిరంజీవి?
అయితే ఈ సినిమాకుగానూ తన పారితోషికం మొత్తం ఇస్తే కానీ కుదరదని చిరంజీవి బెట్టు చేశాడని, దీంతో నిర్మాత అనిల్‌ సుంకర తన ఆస్తులు తాకట్టు పెట్టి మరీ అతడికి డబ్బులు ఇచ్చేశాడంటూ ఓ ఫేక్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దీనిపై బేబీ డైరెక్టర్‌ సాయి రాజేశ్‌ ఘాటుగానే స్పందించాడు. 'నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది. ఇంకో వారం రోజులు చిరంజీవి ముక్కు పిండి మరీ డబ్బులు ఎలా వసూలు చేశాడో కథలు కథలుగా వస్తాయి. ఇటు పక్క ఎలాగో నిజం చెప్పే మనిషి ఉండడు.

స్వయంగా ఆయన చేత్తో కాఫీ
మేము ఉండగా అనిల్‌ సుంకర గారు వచ్చారని, ఆయన్ను వెయిట్‌ చేయించాడని స్టాఫ్‌తో చెప్పి, పైకి రాగానే అటు వైపుగా ఉన్న ఐరన్‌ సోఫాని తన చేతులతో పక్కకు జరిపి మరీ కూర్చోబెట్టారు. పనిమనిషి తీసుకువచ్చిన కాఫీని ముగ్గురికి ఆయనే ఇచ్చారు. నిర్మాతకు ఆయన ఇచ్చే మర్యాద అలాంటిది! బాధాతప్త హృదయంతో నేను అనిల్‌ సర్‌ దగ్గర పని చేసే ఓ వ్యక్తికి ఫోన్‌ చేసి అసలు నిజం తెలుసుకున్నాను.. మా బాస్‌ మీరనుకుంటున్నట్లు కాదు.. ఆయన వేరే.. మా హీరో చిరంజీవిని చూసి నేను గర్విస్తున్నాను' అని ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌తో చిరు, అనిల్‌ సుంకర మధ్య ఎటువంటి గొడవ జరగలేదని స్పష్టమవుతోంది.

చదవండి: 20 ఏళ్ల తర్వాత ఆ స్టార్‌ హీరోకు ఓకే చెప్పిన జ్యోతిక

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)