Breaking News

మూడో తరగతిలోనే అమ్మ చనిపోయింది, నాన్న వదిలేసి పోయారు

Published on Thu, 08/10/2023 - 17:56

కమెడియన్‌, హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా భిన్న రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు బాబూ మోహన్‌. ఆహుతి సినిమాతో ఆయన సినీప్రస్థానం మొదలైంది. తొలి సినిమాలోనే మంచి మార్కులు కొట్టేసిన బాబూ మోహన్‌ తక్కువ కాలంలో కమెడియన్‌గా టాప్‌ పొజిషన్‌కు వెళ్లాడు. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాక సినిమాలు తగ్గించేసిన ఈయన దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆర్గానిక మామ హైబ్రీడ్‌ అల్లుడు సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఓ బుల్లితెర షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఆయన పిల్లలు వేసిన ఎమోషనల్‌ స్కిట్‌ చూసి ఏడ్చేశాడు.

తన చిన్ననాటి సంగతులు గుర్తుకు వచ్చాయంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 'ఒక్కసారిగా నన్ను గతంలోకి తీసుకెళ్లారు. నాకు మా అమ్మ గుర్తొచ్చింది. నేను మూడో తరగతి చదువుతుండగా అమ్మ చనిపోయింది. నాకో చిన్న చెల్లెలు. చిన్నప్పటి నుంచి తల దువ్వి జడ వేసి దగ్గరుండి చూసుకున్నాను. మా నాన్న ఎక్కడికో వెళ్లిపోయారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు' అంటూ కంటతడి పెట్టుకున్నాడు.

బాబూ మోహన్‌ ఎక్కువగా కోట శ్రీనివాస్‌ రావుతో కలిసి కామెడీ పండించేవారు. ఆ తర్వాత బ్రహ్మానందంతో ఎక్కుగా కాంబినేషన్‌ కామెడీ సీన్లు ఉండేవి. మామగారు సినిమాకుగానూ బాబూ మోహన్‌ నంది అవార్డు అందుకున్నాడు. తెలుగు వెండితెరపై టాప్‌ కమెడియన్‌గా రాణించిన ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాడు.

చదవండి: వీడియో షేర్‌ చేసిన స్నేహ.. అలా చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటూ అభిమానుల హెచ్చరిక

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)