Breaking News

నాన్న మరణం.. నెలన్నర రోజులు గదిలో బందీగా ఉన్నా: నటుడు

Published on Sat, 01/07/2023 - 15:49

దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ బర్త్‌డే నేడు (జనవరి 7). తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్న ఆయన 2020లో కన్నుమూశారు. క్యాన్సర్‌  మహమ్మారితో చేసిన దీర్ఘకాలం పోరాటంలో తనువు చాలించారు. ఆ సమయంలో ఇర్ఫాన్‌ కుటుంబం, అభిమానులు పడ్డ బాధ మాటల్లో చెప్పలేనిది. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని ఇర్ఫాన్‌ పెద్ద కొడుకు బాబిల్‌ ఖాన్‌ కొంతకాలం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.

'నాన్న మా మధ్య లేడన్న విషయాన్ని నేను నమ్మలేకపోయాను. కానీ వారం రోజుల తర్వాత నాన్న లేని ఎడబాటు మమ్మల్ని కుంగదీసింది. నేనైతే ఆ బాధతో నెలన్నర రోజుల పాటు గదిలోకి వెళ్లి తాళం వేసుకుని అందులోనే ఉండిపోయాను. మామూలుగా నాన్న లాంగ్‌డేస్‌ షూటింగ్‌ షెడ్యూల్స్‌కు వెళ్తూ ఉండేవాడు. ఇది కూడా అలాంటిదేనేమో.. వచ్చేస్తాడేమో అనిపించేది.. కానీ ఎప్పటికీ తిరిగి రాడని అర్థమయ్యాక నా బెస్ట్‌ ఫ్రెండ్‌ను కోల్పోయాననిపించింది. ఎంతో నరకం అనుభవించాను' అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

క్వాలా సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు బాబిల్‌. ప్రస్తుతం అతడు 'ద రైల్వే మెన్‌' అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఆర్‌.మాధవన్‌, కేకే మీనన్‌, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. భోపాల్‌ గ్యాస్‌ విషాద ఘటన ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతోంది. ఇకపోతే శూజిత్‌ సర్కార్‌తో మరో సినిమా కూడా చేస్తున్నాడు బాబిల్‌.

చదవండి: విక్రమార్కుడు తర్వాత నన్ను ఇంట్లో దారుణంగా చూశారు: అజయ్‌
నా తండ్రితోనే పెళ్లి చేస్తున్నారు.. ఎంత ఘోరం?: శ్రీముఖి

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)