Breaking News

బాహుబలి రిటర్న్స్‌

Published on Tue, 04/29/2025 - 00:34

వెండితెరపైకి బాహుబలి తిరిగొస్తున్నాడు. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘బాహుబలి’. అనుష్కా శెట్టి, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలిభాగం ‘బాహుబలి: ది బిగినింగ్‌’ 2015 జూలై 10న, రెండోభాగం ‘బాహుబలి: ది కన్ క్లూజన్ ’ 2017 ఏప్రిల్‌ 28న విడుదలయ్యాయి.

ఈ రెండు చిత్రాలూ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. కాగా ఈ ఏడాది అక్టోబరులో ‘బాహుబలి’ సినిమాను రీ–రిలీజ్‌ చేయనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది అక్టోబరులో ‘బాహుబలి’ సినిమాను రీ–రిలీజ్‌ చేయనున్నాం.

ఇండియాలోనే కాదు.. ఇంటర్‌నేషనల్‌గా కూడా ఈ రీ–రిలీజ్‌ ఉంటుంది. కొన్ని సర్‌ప్రైజ్‌లూ ఉంటాయి. బాహుబలి రిటర్న్స్‌’’ అంటూ ఆయన పేర్కొన్నారు. ‘బాహుబలి: ది కన్ క్లూజన్ ’ సినిమా విడుదలై ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రీ రిలీజ్‌ విషయాన్ని మేకర్స్‌ వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే రీ–రిలీజ్‌ విడుదల తేదీపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు మేకర్స్‌.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)