Breaking News

‘బాహుబలి: ది ఎపిక్‌’ ట్విటర్‌ రివ్యూ

Published on Thu, 10/30/2025 - 14:12

ఇండియన్‌ సినిమా హిస్టరీలో ‘బాహుబలి’ ఒక చరిత్ర. ఈ మూవీ తొలిభాగం 2015లో రిలీజై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలవడమే కాదు.. పాన్‌ ఇండియా చిత్రాలకు పునాదిని వేసింది. ఇక బాహుబలి 2 సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు కలిపి ‘బాహుబలి: ది ఎపిక్‌’(Baahubali: The Epic ) పేరుతో అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక్క రోజు ముందే విదేశాల్లో ఈ చిత్రం సందడి చేస్తోంది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం ఈ రోజే రిలీజైంది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

(చదవండి: ‘బాహుబలి’కి డిజాస్టర్‌ టాక్‌..నిర్మాత బలి అన్నారు: రాజమౌళి)

బాహుబలి ది ఎపిక్' విజువల్ వండర్ అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. రీరిలీజ్‌ అయినప్పటికీ..తెరపై చూస్తుంటే ఒక కొత్త చిత్రం చూసినట్లుగానే ఉంటుందని చాలా మంది అంటున్నారు. రాజమౌళి చాలా అద్భుతంగా ఎడిట్‌ చేశారని..క్వాలిటీ అదిరిపోయిందని కామెంట్స్‌ పెడుతున్నారు. ఈ సినిమాలో ప్రధానమైన సన్నివేశాలకు సంబంధించిన వీడియో క్లిప్పులను ఎక్స్‌లో షేర్‌ చేస్తూ ‘మిస్‌ కాకుండా చూడండి’ అని కామెంట్స్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్‌ ఎంట్రీ సీన్‌.. తల నరికే సన్నివేశాలను బాగా వైరల్‌ చేస్తున్నారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడో తెలుసుకోవడం కోసం ఇప్పుడు రెండేళ్లు వేచిచూడాల్సిన అవసరం లేదని... ఎడిట్‌ చేసిన తర్వాత ఈ చిత్రం మరింత అద్భుతంగా ఉందని గైతమ్‌ అన్నారు. ‘ప్రతి సెకనుకు గూస్‌బంప్స్‌ వస్తున్నాయి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ‘బాహుబలి: ది ఎపిక్‌’ని చూడడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం’ అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్‌ చెప్పుకొచ్చాడు.

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)