Breaking News

‘బాహుబలి కాదు.. ప్రొడ్యూసర్ బలి’ అన్నారు: రాజమౌళి

Published on Thu, 10/30/2025 - 12:54

టాలీవుడ్‌ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజై ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. ఈ చిత్రం తర్వాతే వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలు తెరకెక్కించడం ప్రారంభించారు. అంతటి ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి తొలుత డిజాస్టర్‌ టాక్‌ వచ్చిన సంగతి తెలిసింది. ‘బాహుబలి: ది బిగినింగ్‌’ విడుదలైన తొలి రోజు సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. ఈవినింగ్‌ షో నుంచి వరుసగా కలెక్షన్స్‌ పెరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్ని రికార్డులను బద్దలు కొటి​ందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం రెండు భాగాలు కలిపి ‘బాహుబలి: ది ఎపిక్‌’(Baahubali: The Epic)పేరుతో రేపు(అక్టోబర్‌ 31) రీరిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్‌, రానాలతో కలిసి రాజమౌళి( SS Rajamouli ) ఓ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఆయన బాహుబలి రిలీజ్‌ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి వివరించాడు. 'బాహుబలి: ది బిగినింగ్'(2015) చిత్రాకి మొదట వచ్చిన టాక్‌ చూసి తాను షాకయ్యానని చెప్పారు.

‘బాహుబలి’ రిలీజ్‌ రోజు ఉదయం 4 గంటల షోకి డిజాస్టర్‌ టాక్‌ వచ్చింది. కానీ నాకు ఎక్కడో చిన్న నమ్మకం ఉంది. మరీ అంత బ్యాడ్ సినిమా తీయలేదు. కొన్ని సీన్స్ సరిగ్గా లేవేమో.. అవి జనాలకు నచ్చలేదేమో.. డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యానేమో అనుకున్నాను కానీ.. అంత బ్యాడ్ టాక్ వచ్చే సినిమా తీయలేదు అని నాకు లోపల ఒక చిన్న హోప్ ఉండేది. అయితే అది కేవలం 10 శాతం మాత్రమే ఉంది. అప్పట్లో జర్నలిస్టులు, పీఆర్వోలకు కలిపి ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఉండేది. అందులో వదిన శ్రీవల్లీ నెంబర్ కూడా ఉంది. అందులో బాహుబలి సినిమాపై తీవ్రమైన విమర్శలు చేశారు. సినిమాలో ప్రభాస్ శివ లింగాన్ని ఎత్తుకున్న ప్లేస్‌లో జండూబాం పెట్టి పోస్టులు పెట్టారు. 

అసలు వీళ్లు ఏమనుకుంటున్నారు? పెద్ద పుడింగులు అనుకుంటున్నారా? ఒక్కొక్కరికి ఎంత పొగరు.. వీళ్లే పెద్ద గొప్ప సినిమా తీశారని అనుకుంటున్నారా?. ఈ సినిమాతో అయిపోయారు. ఇది బాహుబలి కాదు.. ప్రొడ్యూసర్ బలి.. డిస్ట్రిబ్యూటర్ బలి.. ఎగ్జిబిటర్ బలి' అని గ్రూప్ లో అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె మాకు ఎవరికీ చెప్పకుండా ఒక్కతే ఆ కామెంట్స్‌ చూస్తూం ఉండిపోయింది. తర్వాత మాకు ఈ విషయం చెప్పింది. అయితే నిర్మాత సాయి మాత్రం ‘టాక్‌ గురించి పట్టించుకోకండి..కలెక్షన్స్‌ ఉధృతంగా ఉన్నాయి. అంత బ్యాడ్‌ టాక్‌ ఉంటే ఫస్ట్‌షోకి వసూళ్లు పెరగవు కదా’ అన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే కలెక్షన్స్‌ పెరగడం ప్రారంభమైయ్యాయి. శనివారం మంచి రెస్పాన్స్‌ వచ్చింది..అయినా శ్రీవల్లి నమ్మలేదు. ఆదివారం వరకు చూద్దాంలే అనుకున్నాం. సండే ఈవినింగ్‌ అందరం కలిసిన తర్వాత ‘హమ్మయ్యా’ అనుకున్నాం’ అని రాజమౌళి అన్నారు.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)