Breaking News

'బాహుబలి: ది ఎపిక్‌' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. రికార్డ్స్‌ అన్నీ క్లోజ్‌

Published on Sat, 11/01/2025 - 08:59

‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్‌’పేరుతో అక్టోబర్‌ 31న రీరిలీజ్‌ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ క్రేజ్‌ ఉండటంతో చాలాచోట్ల థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అయ్యాయి. దీంతో రీరిలీజ్‌ చిత్రాల మొదటిరోజు కలెక్షన్స​్‌ జాబితాలో ఈ మూవీ మొదటి స్థానంలో నిలిచింది. భవిష్యత్‌లో అంత సులువుగా ఎవరూ అందుకోలేనంత రేంజ్‌లో సత్తా చాటింది. భారత సినీ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్ సాధించిన రీ-రిలీజ్‌ చిత్రంగా బాహుబలి: ది ఎపిక్‌ నిలిచింది.

ఇండియన్‌ సినిమా చరిత్రలో ఎన్నో సినిమాలు రీరిలీజ్‌ అవుతూనే ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు మొదటిరోజు ఎక్కువ కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా విజయ్‌ 'గిల్‌' రూ. 10 కోట్ల గ్రాస్‌తో ఉంది. ఆ తర్వాత గబ్బర్‌ సింగ్‌‌ రూ. 8 కోట్ల గ్రాస్‌తో ఉంది. ఇప్పుడా రికార్డ్స్‌ అన్నీ  ‘ప్రభాస్‌‌’ సినిమా దాటేసింది. ‘బాహుబలి: ది ఎపిక్‌’ మొదటిరోజే ఏకంగా రూ. 10.4 కోట్ల నెట్‌ సాధించినట్లు ప్రముఖ ట్రేడింగ్ వెబ్‌ సైట్‌‌ సాక్నిల్క్ పేర్కొంది. అదే గ్రాస్‌ పరంగా చూస్తే రూ. 18 కోట్లకు పైగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్‌ సినిమా చరిత్రలో ఇంతటి రేంజ్‌లో కలెక్షన్స్‌ సాధించిన సినిమా ఏదీ లేదు. ఇలా రీరిలీజ్‌తో బాహుబలి తన మార్క్‌ ఏంటో మరోసారి ఇండస్ట్రీకి చూపింది.

రీ-రిలీజ్‌ ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్‌-5 సినిమాలు

  • బాహుబలి: ది ఎపిక్‌- (రూ. 18 కోట్ల గ్రాస్‌)

  • గిల్‌- విజయ్‌- తమిళ్‌ (రూ. 10 కోట్ల గ్రాస్‌)

  • గబ్బర్‌ సింగ్‌ - (రూ. 8 కోట్ల గ్రాస్‌)

  • బిజినెస్‌మేన్‌- (రూ. 5.27 కోట్ల గ్రాస్‌)

  • మురారి - (రూ. 5 కోట్ల గ్రాస్‌)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)