Breaking News

Ayalaan OTT Release: ఓటీటీలోకి 'అయలాన్‌'

Published on Wed, 04/03/2024 - 09:20

తమిళ హీరో శివకార్తికేయన్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. ఆయన తమిళ్‌లో నటించిన రెమో, డాక్టర్‌ వరుణ్‌, డాన్‌, ప్రిన్స్‌ చిత్రాలు తెలుగులో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో ‘అయ‌లాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్‌ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం..టాలీవుడ్‌లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో రిలీజైంది. సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో అయ‌లాన్ తెలుగు రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఇప్పటికే తమిళ్‌ వర్షన్‌  ఓటీటీలోకి వచ్చేసింది. భారీ ధరకు డిజిట‌ల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న సన్‌ నెక్ట్స్‌ ఫిబ్రవరిలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి 'అయ‌లాన్' తెలుగు వర్షన్‌ రాబోతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్‌ 19 నుంచి అయలాన్‌ స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం.

ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. కేవలం తమిళ్‌ వర్షన్‌లో సుమారుగా రూ. 100 కోట్ల గ్రాస్‌ను ఈ సినిమా కలెక్ట్‌ చేసింది. 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)