Breaking News

సంక్రాంతికి హిట్ కొట్టిన 'అయలాన్'.. తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Wed, 01/17/2024 - 16:54

తమిళ హీరో శివ కార్తికేయన్.. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ క్రేజ్ సంపాదించాడు. ఇతడు హీరోగా నటించిన 'అయలాన్'.. సంక్రాంతి కానుకగా తమిళంలో రిలీజైంది. థియేటర్ల దొరక్క తెలుగు వెర్షన్ వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రానికి తెలుగు రిలీజ్ డేట్ తాజాగా ఫిక్స్ చేశారు. 

(ఇదీ చదవండి: కన్నడలో సూపర్ హిట్.. ఓటీటీలో తెలుగు వెర్షన్.. రిలీజ్ అప్పుడేనా?)

అయలాన్ అంటే ఏలియన్. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే తొలిసారి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న తెలుగులో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళనాడులో హిట్ టాక్ తెచ్చుకున్న 'అయలాన్'.. నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. లాంగ్ రన్‌లో రూ.100 కోట్లకు చేరువ కావొచ్చు.

ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథతో తీసిన 'అయలాన్'లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. పేరుకే సైన్స్ ఫిక్షన్ మూవీ అయినప్పటికీ ఫ్యామిలీస్‌కి నచ్చే కామెడీ, ఎమోషన్స్ సినిమాలో చాలా ఉన్నాయని అంటున్నారు. మరి తెలుగులో ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'హనుమాన్' మూవీతో హిట్‌ కొట్టాడు.. ఇంతలోనే దర్శకుడికి షాక్!)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)