Breaking News

కారులో వెంబడించాడు.. అలాంటి సైకోని చూడలేదు : హీరోయిన్‌

Published on Sat, 07/11/2026 - 11:33

సినిమా తారలంటే అందరికీ క్రేజ్‌. అభిమాన హీరో, హీరోయిన్లను ఒక్కసారి దగ్గరగా చూడాలని, షేక్‌హ్యాండ్ ఇవ్వాలని, ఫోటో దిగాలని అభిమానులు ఉత్సాహం చూపించడం సహజమే. కానీ ఓ అభిమాని మాత్రం ఫోన్‌ నెంబర్‌ ఇవ్వమంటూ మలయాళ నటి అవంతిక మోహన్‌ని కారులో వెంబడించాడు. ‘మీరంటే ఇష్టం..ఇన్‌స్టాలో రిప్లై ఇవ్వండి’అంటూ ఆమెను ఇబ్బందికి గురిచేశాడు. అతను ఏం చేస్తాడోనన్న భయంతో నవ్వుతూ మాట్లాడుతూ.. ఇన్‌స్టాలో రిప్లై ఇస్తానని చెప్పడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. వ్యక్తిగత పరిమితులను గౌరవించాలని కోరింది.

‘ఇటీవల నాకు చాలా విచిత్రమైన అనుభవం ఎదురైంది. నేను బయట మాస్క్ ధరించి ఉన్నప్పుడు, ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి, ‘మీరు అవంతికనేనా?’ అని అడిగాడు. నేను  కాదని చెప్పినా, నా ఫోన్‌ నెంబర్ కావాలని పట్టుబట్టాడు. నేను మర్యాదగా తిరస్కరించినా, అతను వెనక్కి తగ్గలేదు. నా స్నేహితురాలు అతనిని వెళ్ళమని కోరగా, అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

కొద్దిసేపటి తర్వాత, అతని కారు మమ్మల్ని వెంటాడుతుందని నేను గుర్తించాను. వెంటనే, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్లి, తమను ఫాలో అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాను. వెంటనే అతను ఏడవడం ప్రారంభించాడు, 'నాకు మీరంటే ఇష్టం, మేడం' అని చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రిప్లై ఇవ్వండి అని కూడా అడిగాడు. ఆ సమయంలో నా భద్రత కోసం నేను అంగీకరించడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

నా జీవితంలో చాలా మంది సైకోలను చూశాను, కానీ అతని ప్రవర్తన అంతుకు మించి ఉంది. దయచేసి ఒకరు వద్దంటే గౌరవించండి, పరిమితులను దాటి ప్రవర్తించొద్దు. అభిమాన నటీనటుల పట్ల మర్యాదగా ఉండండి. వారి వ్యక్తిగత జీవితాలను కూడా గౌరవించండి’ అని అనంతిక కోరింది. అవంతిక.. యక్షి- ఫేత్‌ఫుల్లీ యువర్స్‌, గర, ఆలమరం వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించింది.ఇంద్రజిత్ ప్రధాన పాత్రలో నటించిన 'ధీరం' సినిమాలో కూడా అవంతిక ముఖ్య పాత్ర పోషించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)