Breaking News

'బేబీ జాన్' తర్వాత మరో స్టార్‌ హీరోను సెలక్ట్‌ చేసుకున్న అట్లీ

Published on Mon, 12/23/2024 - 06:53

రాజారాణి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అట్లీ డైరెక్టర్‌ శంకర్‌ శిష్యుడు అన్న విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న అట్లీ ఆ తర్వాత విజయ్‌ హీరోగా వరుసగా మెర్సల్‌, తెరీ, బిగిల్‌ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను చేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి షారుక్‌ ఖాన్‌ కథానాయకుడిగా జవాన్‌ చిత్రాన్నిచేశారు. నయనతార, దీపిక పడుకొనే, విజయ్‌ సేతుపతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. 

తాజాగా మరో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ఇంతకుముందు తమిళంలో విజయ్‌ కథానాయకుడిగా తెరకెక్కించిన తెరి చిత్రాన్ని హిందీలో బేబీ జాన్ పేరుతో నిర్మించారు. నటి కీర్తి సురేష్‌ను ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌కి పరిచయం చేశారు. వరుణ్‌ ధావన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఈనెల 25వ తేదీన తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే దర్శకుడు అట్లీ తమిళంలో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. 

బాలీవుడ్‌కు చెందిన మురాద్‌ ఖేతని చిత్ర నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. ఇందులో నటుడు విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. మహారాజా విడుదలై విజయాలతో మంచి జోరు మీద ఉన్న విజయ్‌ సేతుపతి కథానాయకుడుగా నటించనున్న ఈ చిత్రం సంబంధించిన దర్శకుడు, కథానాయకి తదితర వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)