Breaking News

అతియా శెట్టి-కేఎల్ రాహుల్‌కు ఖరీదైన బహుమతులు.. సునీల్ శెట్టి ఏమన్నారంటే..!

Published on Fri, 01/27/2023 - 19:06

ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్‌ రాహుల్ ఇటీవలే వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రేమజంటకు ఖరీదైన బహుమతులు ఇచ్చారంటూ పలు కథనాలు వచ్చాయి. అతియాశెట్టి తండ్రి సునీల్ శెట్టి రూ.50 కోట్ల ఫ్లాట్, కోహ్లీ, ధోని, సల్మాన్ ఖాన్ కూడా ఖరీదైన బహుమతులు అందించారంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే ఈ వార్తలపై అతియా కుటుంబసభ్యులు స్పందించారు. అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. ఇలాంటి వివరాలు రాసేముందు తమను సంప్రదించాలని సునీశ్ శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కాగా.. కేఎల్ రాహుల్‌ - అతియా శెట్టి కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో ఈనెల 23న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ముంబయిలోని  సునీల్‌ శెట్టికి చెందిన ఖండాలా ఫామ్‌హౌస్‌లో పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు,కొద్దిమంది సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు ఖరీదైన బహుమతులు ఇచ్చారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. జాకీ ష్రాఫ్‌, అర్జున్‌ కపూర్‌, విరాట్‌ కోహ్లీ, ధోనీ.. డైమండ్‌ హారం, బైక్‌, కారు బహుకరించినట్లు రాశారు. వీటిని సునీల్ శెట్టి ఖండించడంతో అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది. 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)