రూ.8 కోట్లు పెడితే రూ.75 కోట్లు.. ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్‌

Published on Sat, 02/15/2025 - 17:06

ఓటీటీ (OTT)లో ఎప్పటికప్పుడు బోలెడన్ని సినిమాలు, సిరీస్‌లు రిలీజవుతూనే ఉన్నాయి. తాజాగా మలయాళ హిట్‌ మూవీ డిజిటల్‌ ఎంట్రీకి సిద్ధమైంది. అసిఫ్‌ అలీ (Asif Ali), అనస్వర రాజన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన రేఖాచిత్రం మూవీ (Rekhachithram Movie) ఓటీటీలో రిలీజవుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీలివ్‌ (SonyLiv) సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. 

'అందరూ మర్చిపోయిన నేరం.. పాతిపెట్టిన నిజాన్ని వెలికితీసే సమయం ఆసన్నమైంది. మార్చి 7న రేఖాచిత్రం సోనీలివ్‌లో చూసేయండి' అని ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. జనవరి 9న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. కేవలం రూ.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన రేఖాచిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.75 కోట్లు వసూలు చేసింది.

కథేంటంటే?
మలక్కప్పర ప్రాంతంలో జరిగే ఘటనలు.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్ వివేక్‌ను కలవరపరిచే ఆత్మహత్య కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే వివేక్‌ ఆ కేసుని ఎంతకీ ఛేదించలేకపోతాడు. ఎటు వెళ్లినా కేసు ఓ కొలిక్కి రాదు. చివరకు ఈ కేసు.. మరో కేసుకి లీడ్ ఇస్తుంది. సినిమా షూటింగ్, అందులో మిస్ అయిన ఓ వ్యక్తి.. పాతిపెట్టిన శవం దొరకడం వంటి ఘటనలతో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుంటాయి. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేఖాచిత్రం ఓటీటీలో చూడాల్సిందే!

రేఖాచిత్రం విషయానికి వస్తే.. అసిఫ్‌, అనస్వరతో పాటు మనోజ్‌ కె.జయన్‌, సిద్దిఖి, జగదీశ్‌, సాయికుమార్‌, హరిశ్రీ అశోకన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జాఫిన్‌ టి.చాకో దర్శకత్వం వహించాడు. ముజీబ్‌ మజీద్‌ సంగీతం అందించాడు.

చదవండి: నోరు జారిన రష్మిక.. ఫైర్‌ అవుతున్న కన్నడ ప్రజలు!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)