Breaking News

ఒక్క మూవీకే రూ.32 కోట్ల నష్టం, సినిమాలు వదిలేద్దామనుకున్నా

Published on Fri, 05/05/2023 - 13:51

అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని.. అన్నాడో సినీ కవి. ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఏ సినిమా అయినా హిట్టవ్వాలని కోరుకుంటారు. కానీ ప్రతి సినిమా హిట్టవ్వదు. ప్రేక్షకులకు నచ్చితేనే ఓటేస్తారు, నచ్చకపోతే తిరస్కరిస్తారు. అలా కొన్ని భారీ బడ్జెట్‌ సినిమాలు సైతం బాక్సాఫీస్‌ దగ్గర ఘోరంగా చతికిలపడి నిర్మాతలకు తలనొప్పి తెచ్చి పెట్టాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన శక్తి సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుంది.

తాజాగా ఈ సినిమా ఫలితం గురించి స్పందించాడు ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్‌. 'ఆ రోజుల్లో పంపిణీ అంతా నిర్మాతలే చూసుకునేవారు. అందువల్ల నష్టం వస్తే నిర్మాతలు తట్టుకోలేకపోయేవారు. చేసిన అప్పులు తీర్చేందుకు ఇళ్లు, పొలాలు, భూములు అమ్ముకున్న ఎంతోమందిని కళ్లారా చూశాను. అందుకే నేను ఎప్పుడూ కొంత జాగ్రత్త పడేవాడిని. ఏదైనా సినిమా తీసి దెబ్బతిన్నప్పుడు చిరంజీవి పిలిచి కథ రెడీ చేసుకోండి, మనం సినిమా చేద్దాం అనేవారు. నాగార్జున కూడా అంతే, వేరే సినిమాలు ఆపేసి మరీ నాకోసం సినిమాలు చేసేవారు.  ఆరోజుల్లో అలా ఉండేది.

నాకు బాగా అసంతృప్తిని ఇచ్చిన సినిమా శక్తి. ఈ ఒక్క సినిమాతోనే రూ.32 కోట్లు పోయాయి. నేను షాక్‌లోకి వెళ్లిపోయాను. అందుకే నాలుగైదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాను.‌ నిజానికి ఇండస్ట్రీ నుంచే వెళ్లిపోదామనుకున్నాను. ఇక్కడ బాగా సక్సెస్‌ అయిన చూడాలని ఉంది సినిమాను నేను, అరవింద్‌ కలిసి హిందీలో తీశాం. రూ.12 కోట్ల నష్టం వచ్చింది. అంటే చెరి ఆరు కోట్ల నష్టం. అప్పటికి ఇద్దరం ఫామ్‌లో ఉన్నాం కాబట్టి మళ్లీ వెంటనే కోలుకున్నాం' అని చెప్పుకొచ్చాడు. కాగా అశ్వినీదత్‌ ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా ప్రాజెక్ట్‌ కె(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా నిర్మిస్తున్నాడు.

చదవండి: ఆమెను ఇంప్రెస్‌ చేయడానికి ఎన్నో వెధవ పనులు చేశా: డైరెక్టర్‌
నేను చనిపోలేదు, అలా అని రిటైర్‌మెంటూ తీసుకోలేదు: నటుడు

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)