కొత్తగా ప్రయత్నించాలని ఈ సినిమా చేశాను: అశ్విన్‌బాబు

Published on Thu, 08/01/2024 - 03:17

అశ్విన్‌బాబు హీరోగా నటించిన చిత్రం ‘శివం భజే’. ఇందులో దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్‌. మూలి మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు (గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో అశ్విన్‌బాబు మాట్లాడుతూ– ‘‘హిడింబ’ తర్వాత చాలా కథలు విన్నాను. మళ్లీ ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నించాలనుకుంటున్న సమయంలో ‘శివం భజే’ కథ విన్నాను. చాలా నచ్చింది.

నా గత చిత్రాలు ‘రాజుగారి గది, హిడింబ’లా ‘శివం భజే’ పాయింట్‌ బాగుంటుంది. ఈ చిత్రంలో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాను. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అంతా విధి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా!.. ఆ టైపులో ఇందులోని నా క్యారెక్టర్‌ ఉంటుంది. అప్సర్‌ ‘శివం భజే’ కథను రాసుకున్న తీరు, ఐడియాలజీ నాకు నచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు కథను డివైన్‌ పాయింట్‌కు కనెక్ట్‌ చేసిన విధానం బాగుంటుంది.

నిర్మాత రాజీ పడకుండా ఎక్కువే ఖర్చుపెట్టారు. ఏమన్నా అంటే అంతా శివయ్య చూసుకుంటారు అనేవారు. ఆగస్టు 1న నా బర్త్‌ డే కాబట్టి ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్‌ చేయలేదు. మేం ఓ రిలీజ్‌ డేట్‌ అనుకున్నాం. సరిగ్గా అది నా బర్త్‌ డేకి కుదిరింది... అంతే. ఇక ‘రాజుగారి గది 4’ సినిమా ప్లానింగ్‌ జరుగుతోంది. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు.

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

హిమాలయాలు కరుగుతున్నాయ్!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)