Breaking News

రాహుల్‌కు కంగ్రాట్స్‌ చెప్పిన అషురెడ్డి, మరోసారి తెరపైకి ఎఫైర్‌ రూమర్స్‌

Published on Thu, 01/12/2023 - 15:47

ప్రస్తుతం నాటు నాటు సాంగ్‌ ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని ఈ పాటకు బెస్ట్‌ ఓరిజినల్‌ సాంగ్‌.. నాన్‌ ఇంగ్లీష్‌ క్యాటగిరిలో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎమ్‌ఎమ్‌ కీరవాణి అందుకున్నారు. ఆస్కార్‌ తర్వాత అంతటి స్థాయిలో గుర్తింపు పొందిన అవార్డు మన ఇండియన్‌ మూవీకి రావడం ఇదే తొలిసారి. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ టీం, డైరెక్టర్‌ రాజమౌళి, ఎమ్‌ఎమ్‌ కీరవాణిలకు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు నీరాజనాలు పలుకుతున్నారు.

చదవండి: పుట్టబోయే బిడ్డ గురించి చెబుతూ ఎమోషనల్‌ అయిన ఉపాసన, ట్వీట్‌ వైరల్‌

ఇక ఈ పాట పాడిన సింగర్‌ రాహుల్‌ సిప్లగంజ్‌ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బై పోతున్నాడు. ఇంటర్నేషనల్‌ స్టేజ్‌పై కీరవాణి రాహుల్‌ పేరు చెప్పడం, ఈ అవార్డు విన్నింగ్‌ క్రెడిట్‌ ఇవ్వడంతో అనందంలో తేలిపోతున్నాడు. ఇక ఈ గ్రేట్‌ సక్సెస్‌ మూమెంట్‌ను తన స్నేహితులు, సన్నిహితుల మధ్య బుధవారం సాయంత్రం సెలబ్రెట్‌ చేసుకున్నాడు రాహుల్‌. అందులో రాహుల్‌ స్నేహితురాలు, అతడి రూమర్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ అషురెడ్డి కూడా పాల్గొంది. ఈ పార్టీలో రాహుల్‌తో క్లోజ్‌గా దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ అతడికి శుభాకాంక్షలు తెలిపింది. దీంతో వీరిద్దరి ఎఫైర్‌ రూమార్స్‌ మరోసారి తెరపైకి వచ్చాయి. 

చదవండి: అందుకే మీరు దళపతి అయ్యారు!: విజయ్‌పై షారుక్‌ ట్వీట్‌

బిగ్‌బాస్‌ అనంతరం చట్టాపట్టేసుకుని తిరిగిన వీరిద్దరు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని అంతా అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అషు, రాహుల్‌ను కౌగిలించుకుని అంత సన్నిహితంగా కనిపించడంతో ‘మళ్లీ కలిసిపోయారా?’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే వారి రిలేషన్‌ గురించి అడిగనప్పుడల్లా అషు, రాహుల్‌ తాము స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. కానీ వారిద్దరు అతిసన్నిహితం చూసి నెటిజన్లు వీరిద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)