Breaking News

ఆశిష్ - రూపాలి.. రెండో పెళ్లి తర్వాత తొలిసారిగా ‍అలా!

Published on Thu, 10/12/2023 - 13:47

పోకిరీ సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి. ఈ సినిమాలో పోలీసు పాత్రలో అభిమానులను అలరించారు. ఆ తర్వాత దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించారు. అయితే ట్రావెల్‌ చేస్తూ వీడియోలు చేస్తున్న ఆశిష్‌ విద్యార్థి  60 ఏళ్ల వయసులో గువాహటికి చెందిన ఫ్యాషన్‌ ఎంట్రప్రెన్యూర్‌ రుపాలీ బరూవాను వివాహమాడిన విషయం తెలిసిందే. అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో రిజిస్టర్‌ వివాహం చేసుకున్నారు. అయితే ఇ‍ప్పటికే ఆయనకు పెళ్లి కాగా.. మొదటి భార్యతో 2021లో విడాకులు తీసుకున్నారు.

(ఇది చదవండి: సినీ ప్రియులకు బంపరాఫర్.. కేవలం రూ.99 కే టికెట్!)

తాజాగా ఇటీవల ఆయన సొంతూరుకు వెళ్లారు. కేరళలోని హోమ్ టౌన్‌కు వెళ్లిన ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన రెండో భార్య రూపాలిని మొదటిసారి మా ఊరికి వచ్చిందని వెల్లడించారు. తనకు సొంత గ్రామాన్ని సందర్శించడం సంతోషంగా ఉందంటూ తను బాల్యంలో ఉన్న ఇంటిని వీడియో చూపించారు. తొలిసారి తన భార్యతో కలిసి ఓనం పండుగకు వచ్చామని ఆశిష్ వివరించారు.  

ఇన్‌స్టాలో రాస్తూ..'కేరళలోని నా స్వస్థలాన్ని సందర్శించాను. ఇక్కడ నా బాల్యంలో జ్ఞాపకాలు ఉన్నాయి. రూపాలికి ఇక్కడికి రావడం ఇదే  మొదటిసారి. తనతో కలిసి మొదటి ఓనం జరుపుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేశారు. అయితే ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లిపై  ట్రోల్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ లేటు వయసులో పెళ్లి అవసరమా? అంటూ చాలా మంది విమర్శలు చేశారు. అయితే వాటిని ఆయన సున్నితంగా కొట్టిపారేశారు. రెండో భార్య రుపాలీ బరూవా సైతం అలాంటి వాటిని పట్టించుకోనని గతంలోనే  తెలిపింది. 

(ఇది చదవండి: విజయ్ 'లియో' మూవీ.. సామాన్యుడిలా తిరుమలకు డైరెక్టర్!)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)