Breaking News

రెండో పెళ్లిపై దారుణ ట్రోల్స్.. స్పందించిన ఆశిష్ విద్యార్థి

Published on Wed, 06/07/2023 - 16:00

మహేశ్ బాబు పోకిరీ చిత్రంతో ఫేమ్ తెచ్చుకున్న ఆశిష్ విద్యార్థి టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే రెండో పెళ్లి చేసుకుని ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అస్సాం రాష్ట్రానికి వ్యాపారవేత్త రూపాలీ బరువాను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇప్పటికే మొదటి భార్య పిలూ విద్యార్థితో విడాకులు తీసుకున్నారు. 

(ఇది చదవండి: భోళా శంకర్‌: మెగాస్టార్‌, నందమూరి ఫ్యాన్స్‌ కోసం భలే స్కెచ్‌!)

అయితే 57 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడంతో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా  ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆశిష్ విద్యార్థి తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందించారు. రెండో పెళ్లి చేసుకున్నాక తనను కించపరిచేలా ట్రోల్స్ చేశారని అన్నారు. చాలా దారుణమైన పదాలు ఉపయోగించారని ఆయన అన్నారు. ఇది తన వ్యక్తిగత విషయమని.. ఇలాంటి విషయాల్లో మద్దతుగా నిలవాలని సూచించారు. 

ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ.. 'తనపై బుడా(ముసలి), ఖుసత్ (సభ్యత , సంస్కారం లేని) లాంటి అవమానకరమైన పదాలతో ఉపయోగించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే మనలో ప్రతి ఒక్కరూ వయసులో పెద్దవాళ్లమనే భయాన్ని మనలోనే ఉంచుకుంటాం. అదే విషయాన్ని ఇతరులకు కూడా చెబుతున్నాం. కానీ ప్రస్తుతం జనరేషన్ మారింది. వయసు మీద పడినంత మాత్రాన ఎలాంటి పనులు చేయకూడదని మనకు మనమే చెప్పుకుంటున్నాం కదా. కానీ మన జీవితాన్ని సంతోషంగా ముగించాలకున్నప్పుడు.. ఎవరైనా సరే తోడు కావాలని ఎందుకు కోరుకోకూడదు?' అని అన్నారు.

(ఇది చదవండి: నాలుగున్నరేళ్లుగా నటుడితో సహజీవనం.. మీరిక పెళ్లి చేసుకోరా?)

తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని.. ప్రతి విషయాన్ని చట్టబద్ధంగా వ్యవహరిస్తానని తెలిపారు. పన్నులు చెల్లిస్తున్నానని, కష్టపడి పనిచేస్తున్నానని అన్నారు. కుటుంబాన్ని కలిగి ఉండాలనే ఆసక్తితోనే చట్టబద్ధంగా వివాహం చేసుకున్నట్లు వివరించారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ప్రజలు ఒకరిని నిందించకుండా.చ. ఒకరికొకరు మద్దతుగా ఉండాలని ఆశిష్ అన్నారు. 
 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)