Breaking News

నేను బతికే ఉన్నా.. ఛాన్సులివ్వమని ఎందుకన్నానంటే: ఆశిష్‌ విద్యార్థి

Published on Mon, 03/25/2024 - 12:02

ఆశిష్‌ విద్యార్థి.. డిల్లీలో పుట్టి, పెరిగిన ఆయన 1991లో ‘కాల్‌ సంధ్య’ అనే హిందీ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ‘పాపే నా ప్రాణం’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మహేశ్‌ బాబు నటించిన పోకిరి సినిమాతో టాలీవుడ్‌లో ఆయన పేరు మారుమ్రోగింది. దీంతో ఒక్కసారిగా ఆయనకు లెక్కలేనన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. విలన్‌ పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాడు.  

అతిథి, తులసి, పోకిరి, లక్ష్యం, అలా మొదలైంది, నాన్నకు ప్రేమతో వంటి ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. కొద్దిరోజు క్రితం రైటర్‌ పద్మభూషణ్‌ సినిమాలో హీరో తండ్రిగా కనిపించి మెప్పించిన ఆయన  రానా నాయుడు వంటి వెబ్‌సిరీస్‌లోనూ దుమ్మురేపాడు. కన్నడ, తమిళ్‌, మలయాళం, బెంగాలీ, ఒడియా, ఇంగ్లిష్‌ చిత్రాల్లోనూ నటించిన ఆయన కెరీర్‌ ప్రారంభంలోనే (1995) జాతీయ అవార్డు అందుకున్నాడు.

సినిమా ఇండస్ట్రీలో నాడు బిజీగా ఉన్న ఆయన నేడు అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. ఆయన కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను బతికే ఉన్నాను. నాకు కూడా అవకాశాలు ఇవ్వండి. నన్ను గుర్తించి ఆఫర్లు ఇవ్వండి అంటూ కామెంట్లు చేశాడు. అప్పట్లో ఆయన చేసిన  వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయనకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి అంటూ కొందరు ఆశ్చర్యపోయారు కూడా..

తాజాగా ఆ వ్యాఖ్యలపై మరోసారి ఆశిష్‌ విద్యార్థి స్పందించారు. నేను చాలా భాషలలో నటించాను. అందులో ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. ఒక్కోసారి విలన్‌ పాత్రలు కూడా చేశాను. కానీ నన్ను ఇప్పటికీ అలానే చూస్తున్నారు. అలాంటి పాత్రలే ఆఫర్‌ చేస్తున్నారు. కానీ నేను వేరే పాత్రలు కూడా చేయగలను. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు సరికొత్త పాత్రలు చేయగలను. ఆ కోణంలో కూడా  నన్ను చూడాలనే అభిప్రాయంతో ఆ వ్యాఖ్యలు చేశాను.' అని ఆయన అన్నారు. ఆశిష్‌ ఇటీవల రుపాలీ బరూవాను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)