Breaking News

అది సవాల్‌గా అనిపించింది : ఆషికా రంగనాథ్‌

Published on Sat, 01/10/2026 - 10:47

‘‘రవితేజగారు అద్భుతమైన నటుడు. ఆయనతో కలసి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో నటించడం హ్యాపీగా ఉంది. వినోదం, భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. ఈ మూవీలో మానస శెట్టిగా ఈ తరం అమ్మాయిలు రిలేట్‌ అయ్యే క్యారెక్టర్‌ చేశాను. నా పీఏ క్యారెక్టర్‌లో సత్య కనిపిస్తారు. రవితేజ, సునీల్‌గార్లు, వెన్నెల కిశోర్, సత్య, గెటప్‌ శ్రీను... అందరూ అద్భుతమైన కామెడీ టైమింగ్‌ ఉన్న నటులు. వాళ్ల టైమింగ్‌ని మ్యాచ్‌ చేయడం సవాల్‌ అనిపించింది’’ అని ఆషికా రంగనాథ్‌ తెలిపారు. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్‌ హయతి, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. 

ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆషికా రంగనాథ్, డింపుల్‌ హయతి విలేకరులతో మాట్లాడారు. ఆషికా రంగనాథ్‌ మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘నా సామి రంగ’లోని ΄ాత్రతో పోల్చుకుంటే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో చేసిన పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. 

ప్రస్తుతం ‘విశ్వంభర, సర్దార్‌ 2, అది నా పిల్లరా’ సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. డింపుల్‌ హయతి మాట్లాడుతూ– ‘‘కిశోర్‌ తిరుమలగారు ఈ కథ చెప్పగానే రవితేజగారి భార్య బాలామణి పాత్ర చేయాలనుకున్నాను. ‘ఖిలాడి’ మూవీ తర్వాత రవితేజగారితో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. డైరెక్టర్‌గారు ప్రతిదీ నటించి, చూపించారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అందరూ రిలేట్‌ అయ్యే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌’’ అని పేర్కొన్నారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)