Breaking News

నన్ను వాడుకుని వదిలేస్తే అట్టర్‌ ఫ్లాపే అవుతుంది: నటి

Published on Sat, 04/06/2024 - 17:34

అన్నీ అనుకున్నట్లుగా జరగవు.. ఇది సినిమాకూ వర్తిస్తుంది. సినిమా మొదలుపెట్టినప్పుడు ఎన్నో పాత్రలు రాసుకుంటారు, షూటింగ్‌ చేస్తారు. తీరా ఎడిటింగ్‌లో సగం కంటే ఎక్కువ పాత్రలు డిలీట్‌ చేస్తారు. మరికొన్నింటిని నిమిషాల నుంచి సెకన్లకు కుదిపేస్తారు. అలా ఇటీవలే డీజే టిల్లులో శ్రీసత్యకు అన్యాయం చేశారు. తనతో డైలాగులు చెప్పించి మరీ ఎడిటింగ్‌లో అదంతా తీసేయించారు.

అందరి టైం వేస్ట్‌
ఇప్పుడు తనకూ అలాంటి అన్యాయమే జరిగిందంటోంది సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఆశా బోరా. నాలాంటిదాన్ని పిలిచి మరీ స్టఫ్‌లా వాడుకుని వదిలేస్తే సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ కాకపోతే ఇంకేం అవుతుంది.. సీన్లు, సాంగ్సు, ఫ్యామిలీ ఫంక్షన్లు.. ఇలా ప్రతిదాంట్లోనూ నేనే కనిపించానుగా.. అంటూ వ్యంగ్యంగా సెటైర్లు వేసింది. 'ఇంతోటిదానికి నా టైం వేస్ట్‌ చేసి, మీ టైం వేస్ట్‌ చేసుకున్నారు. ఈ పాత్ర నేనే చేయాలంటూ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ దగ్గరి నుంచి కాస్టింగ్‌ డైరెక్టర్‌ వరకు అందరూ ఫోన్లు చేసి అనవసరంగా హంగామా చేశారు.

ఆరోగ్యం బాలేకపోయినా..
ఉఫ్‌.. అయినా హైదరాబాద్‌లో జూనియర్‌ ఆర్టిస్టులకు కరువొచ్చిందా? లేక సోషల్‌ మీడియా ఫేస్‌లను ఉపయోగించుకోవాలని చేశారో మరి! మా పనులు మానుకొని, కుటుంబాన్ని వదిలేసి వచ్చి ఒక రోజంతా నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకొచ్చి, ఆరోగ్యం బాగోలేకపోయినా చెప్పిన మాట కోసం షూటింగ్‌కు వచ్చాను. యాంటి బయాటిక్స్‌ వేసుకుని, పొద్దున్నుంచి సాయంత్రం దాకా నిలబడి ఉంటే కనీసం ఒక్క డైలాగ్‌ కూడా లేదు.

డైలాగ్స్‌ ఉంచినా బాగుండేది
ఇస్తామన్న రెమ్యునరేషన్‌ ఇవ్వకుండా, ట్రావెలింగ్‌ ఖర్చులు చెల్లించకుండా, హోటల్‌లో బస చేసేందుకు డబ్బులివ్వకుండా, మాకేంటి సంబంధం అన్నట్లు సరిగా స్పందించనుకూడా లేదు. వాహ్‌.. గ్రేట్‌! కనీసం విజయ్‌ దేవరకొండతో నేను మాట్లాడిన సంభాషణలు ఉంచినా కాస్త సంతృప్తి ఉండేదేమో! మీ ఎడిటింగ్‌ అలా ఉంది. నా కళ్లు తెరిపించినందుకు థ్యాంక్స్‌. ఇలా ప్రశ్నిస్తే కాంట్రవర్సీ అని ట్యాగ్‌ లైన్‌ ఇస్తారు.. ఇస్తారేంటి? ఇచ్చేశారు కూడా!' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ స్టార్‌ టీమ్‌పై విమర్శలు గుప్పించింది.

చదవండి: ‘ఫ్యామిలీ స్టార్‌’బంపరాఫర్‌.. మీ ఇంటికే విజయ్‌ దేవరకొండ!

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)