Breaking News

వయనాడ్ పర్యటనలో మోహన్‌ లాల్‌, రవి.. ఆర్మీ రిటైర్డ్ అధికారి ఫిర్యాదు

Published on Tue, 08/06/2024 - 09:59

కేరళలోని వయనాడ్‌ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్‌తో పాటు రిటైర్డ్ మేజర్‌, నటుడు A. K. రవీంద్రన్ పాల్గొన్న విషయం తెలిసిందే.  వయనాడ్ పర్యటన సందర్భంగా యూనిఫాం దుర్వినియోగం చేసినందుకు మేజర్ రవిపై మరో రిటైర్డ్ అధికారి ఫిర్యాదు చేశారు.

విపత్తు బారిన పడిన వాయనాడ్ ప్రాంత పర్యటనలో ఆర్మీ యూనిఫాం దుర్వినియోగం చేశారనే ఆరోపణలు సినీ దర్శకుడు, మేజర్ రవి ఎదుర్కొంటున్నారు. ఆర్మీ రిటైర్డ్  అధికారి అరుణ్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు, రక్షణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సైన్యంలో పదవీ విరమణ పొందిన తర్వాత ఎవరూ కూడా మళ్లీ సైనిక యూనిఫామ్‌ ధరించడం నిషేధం. డిఫెన్స్ సర్వీస్ నిబంధనలను మేజర్ రవి ఉల్లంఘించారని ఆరుణ్‌ ఆరోపించారు.  వాస్తవంగా రవీంద్రన్‌ ఇండియన్‌ ఆర్మీలో అత్యున్నత స్థానంలో పనిచేసి మేజర్‌ ర్యాంక్‌ వరకు చేరుకుని ఆపై రిటైర్డ్‌ అయ్యారు.

అయితే, ఆర్మీ దుస్తులు ధరించి ఫోటోలు తీయడం ఆపై వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటి చర్యలకు మేజర్ రవి పాల్పడ్డారని అరుణ్ విమర్శించారు. ఇలాంటి పనులు చేయడం వల్ల  సైనిక యూనిఫామ్‌ సమగ్రతను దెబ్బతినడంతో పాటు  తీవ్రమైన భద్రతా సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.  ఈ సంఘటన నెటిజన్ల నుంచి కూడా విస్తృతమైన ఎదురుదెబ్బకు దారితీసింది, నెట్టింట కూడా మేజర్ రవి తీరును ఖండించారు.

మేజర్ రవి, నటుడు మోహన్‌లాల్‌తో కలిసి వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సందర్శించారు. విపత్తులో తీవ్రంగా దెబ్బతిన్న స్థానిక పాఠశాలను పునర్నిర్మించడానికి సహాయం చేస్తానని చెప్పి ఆ పని చేసినందుకు ఆయన్ను అందరూ అభినందించారు. కానీ, ఒక విషాదం-బాధిత ప్రాంతంలో సెల్ఫీలు తీసుకోవడం వల్ల ఈ విమర్శలకు దారితీసింది. మేజర్ రవి సినిమా రంగంలో కూడా పనిచేశారు. దర్శకుడగా మాత్రమే కాకుండా నటుడిగా పలు సినిమాల్లో మెప్పించారు. అలా ఆయనకు ఆర్మీ, సినిమా రంగాల్లో సత్తా చాటారు.   
 

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)