Breaking News

ఆన్‌స్క్రీన్‌పై మరోసారి జత కట్టనున్న రియల్‌ కపుల్‌.. పెళ్లయ్యాక తొలిసారి!

Published on Sun, 07/30/2023 - 08:42

తమిళసినిమా: నటుడు ఆది పినిశెట్టి నటి నిక్కి గల్రాణి జంటగా నటించిన చిత్రం మరకత నాణయం. ఈ చిత్రం ద్వారా ఏఆర్కే శరవణ్‌ దర్శకుడుగా పరిచయం అయ్యారు. 2017లో విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. నటుడు ఆది పినిశెట్టి కెరీర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోయింది. దర్శకుడు ఏ ఆర్‌ కె .శరవణ్‌ కు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా ఈయన సుమారు ఐదేళ్ల తర్వాత ఇటీవల హిప్‌ హాప్‌ తమిళా ఆది హీరోగా వీరన్‌ అనే సోషియో ఫాంటసీ కథాచిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

అంతే కాకుండా ఓటిటిలోనూ వీక్షకుల విశేష ఆదరణతో స్ట్రీమింగ్‌ అవుతోంది. కాగా ప్రస్తుతం దర్శకుడు ఏ ఆర్‌ కె శరవణ్‌ తన తాజా చిత్రాల పనిలో చాలా బిజీగా ఉన్నారు. దీని గురించి ఆయన పేర్కొంటూ తన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించటం సంతోషంగా ఉందన్నారు. వీరన్‌ చిత్రం తర్వాత పలు అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.

2023– 24 లో తాను చాలా బిజీగా ఉంటానని చెప్పారు. ముఖ్యంగా ఇంతకుముందు ఆది పినిశెట్టి, నిక్కి గల్రాణి జంటగా తాను దర్శకత్వం వహించిన మరకత నాణయం చిత్రానికి సీక్వెల్‌ కు దర్శకత్వం వహించనున్నట్లు చెప్పారు. ఇందులోనూ అదే జంట నటిస్తారని తెలిపారు. ఆ తర్వాత విష్ణు విశాల్‌ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు దీన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్‌ సంస్థ నిర్మించనుందని తెలిపారు. ఇది ఫాంటసీ కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు ఏఆర్కే శరవణ్‌ చెప్పారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)