Breaking News

ఓటీటీలో 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి'.. ఉచితంగానే స్ట్రీమింగ్‌

Published on Fri, 05/16/2025 - 12:37

విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. భారీ యాక్షన్‌ కాన్సెప్ట్‌తో నూతన దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై అశోక్‌ వర్ధన్‌, సునీల్‌  నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చెప్పే అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతిని  ఈ వీకెండ్‌లో ఇంట్లోనే చూసేయండి.

ఏప్రిల్‌ 18న విడుదలైన అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు భారత్‌లో ఉచితంగానే స్ట్రీమింగ్‌ అవుతుంది. కొద్దిరోజుల క్రితం యూకేలో ఉన్నవాళ్లు అద్దె విధానంలో మాత్రమే చూసే అవకాశం కల్పిస్తూ ఓటీటీలో విడుదల చేశారు. అయితే, ఇప్పుడు సడెన్‌గా భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో అభిమానులు నెట్టింట షేర్‌ చేస్తున్నారు.

‍అర్జున్ సన్నాఫ్ వైజయంతి కథ విషయానికొస్తే.. సీన్సియర్ పోలీస్ ఆఫీసర్  వైజయంతి (విజయశాంతి). ఈమెకు ఓ కొడుకు అర్జున్ (కల్యాణ్ రామ్). ఐపీఎస్ అవ్వడానికి రెడీగా ఉన్న ఇతడు.. తండ్రిని ఓ క్రిమినల్ చంపేశాడని పగతో రగిలిపోతుంటాడు. తల్లికి ఇదంతా ఇష్టముండదు. అనుకోని పరిస్థితిలో అర్జున్ ఆ హంతకుడిని అందరూ చూస్తుండగా చంపుతాడు. అప్పటి నుంచీ తల్లీకొడుకుల మధ్య దూరం పెరుగుతుంది. చివరకు వారిద్దరూ ఎలా కలుసుకున్నారు..? తల్లి కోసం కొడుకు చేసిన త్యాగం ఏంటి? అనేదే మిగతా స్టోరీ.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)