Breaking News

కూతురి కోసం యాక్షన్‌ కింగ్‌ మరో ప్రయత్నం, ఈసారైనా వర్కవుట్‌ అయ్యేనా?

Published on Fri, 08/11/2023 - 08:16

యాక్షన్‌ కింగ్‌గా గుర్తింపు పొందిన నటుడు అర్జున్‌. ఈయనలో మంచి దర్శకుడూ ఉన్నాడనే విషయం తెలిసిందే. చాలా ఏళ్ల పాటు హీరోగా నటించిన ఈయన ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఈయనకు ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. అందులో పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్‌ సినీ రంగ ప్రవేశం చేసి తమిళంలో విశాల్‌ సరసన మదయానై చిత్రంలో కథానాయకిగా నటించారు. అయితే ఆ చిత్రం ఆమె కెరీర్‌కు ఏమాత్రం సాయం చేయలేదు.

దీంతో అర్జున్‌ తన కూతురు ఐశ్వర్య కథానాయికగా సొల్లితరవా అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తమిళం, కన్నడం భాషల్లో నిర్మించారు. ఆ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని సాధించలేదు. చాలా గ్యాప్‌ తర్వాత  అర్జున్‌ ఆయన కూతుర్ని కథానాయికగా నిలబెట్టడానికి మరో ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఆయన పాన్‌ ఇండియా చిత్రాన్ని చేస్తున్నారు.

తన సొంత బ్యానర్‌.. శ్రీరామ్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను కూడా ఆయనే చేపట్టారు. ఐశ్వర్య అర్జున్‌ కథానాయికగా నటిస్తున్న ఇందులో ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. నటుడు సత్యరాజ్, ప్రకాశ్‌ రాజ్, జయరాం తదితరులతో పాటు అర్జున్‌ కూడా ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. కేజీఎఫ్‌ చిత్రం ఫేమ్‌ హిన్దేష్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆదిపురుష్‌

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)