Breaking News

సందీప్‌ వంగాతో వివాదం.. తండ్రి తిట్టాడనే అనుకున్నా: రధన్‌

Published on Thu, 04/10/2025 - 14:19

అర్జున్‌ రెడ్డి సినిమా (Arjun Reddy)కు ఇద్దరు మ్యూజిక్‌ డైరెక్టర్లు పని చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ హర్షవర్దన్‌ రామేశ్వర్‌ ఇస్తే పాటలకు రధన్‌ సంగీతం అందించాడు. అతడు అందించిన పాటలు బ్లాక్‌బస్టర్‌ మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచాయి. అయితే సరైన సమయానికి పాటలు ఇవ్వకుండా నా టైం మొత్తం వృధా చేశాడని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా రధన్‌పై విమర్శలు గుప్పించాడు. సిద్దార్థ్‌ రాయ్‌ సినిమా దర్శకుడు కూడా రధన్‌ చెప్పిన సమయానికి పాటలు ఇవ్వకపోగా ఫోన్లు కూడా లిఫ్ట్‌ చేసేవాడు కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

ఆయన తండ్రిలాంటి వారు
ఇలా రధన్‌ వల్ల సినిమా లేటైందని దర్శకులు తిట్టుకున్నారు. తాజాగా ఈ వివాదంపై రధన్‌ స్పందించాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా (Akkada Ammayi Ikkada Abbayi Movie) ఈవెంట్‌లో అతడు మాట్లాడుతూ.. సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) నాకు తండ్రిలాంటివారు. తండ్రి తిడితే ఆయన తిట్టారని ప్రచారం చేసుకోలేం. నాన్న మనల్ని కాకపోతే ఎవర్ని తిడతారు? దాన్ని పట్టించుకోకూడదు. ఎందుకంటే ఆయన తండ్రిలాంటివారు కాబట్టి!

అనుదీప్‌ తల్లిలా..
ఆయన నన్ను తిట్టిన తర్వాత కూడా అనుదీప్‌ (జాతిరత్నాలు), ప్రదీప్‌ మాచిరాజు (అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి) నాపై నమ్మకంతో సినిమా ఆఫర్‌ ఇచ్చారు. అంతర్గత విభేదాలు తలెత్తినప్పుడు కొన్ని పట్టించుకోవాలి, కొన్నింటిని పట్టించుకోకూడదు. సందీప్‌ ఎప్పుడూ అలాగే ఉంటారు. ఒక తండ్రిగా తిట్టారు, తిడతారు. నేనైతే అవేవీ మనసుకు ఎక్కించుకోలేదు. నాన్న తిట్టాడని ఫీలయ్యానంతే! అర్జున్‌ రెడ్డిలో నేను చెత్త మ్యూజిక్‌ అయితే ఇవ్వలేదు కదా.. మంచి సంగీతం ఇచ్చానన్న తృప్తి ఉంది. అనుదీప్‌ నాకు తల్లిగా అనిపించారు. కొందరు తిడతారు, మరికొందరు దగ్గరకు తీసుకుంటారు. అందరూ ఒకేలా ఉండరు అని రధన్‌ వివరణ ఇచ్చాడు.

చదవండి: లక్షలు పెట్టి టికెట్‌ తీసుకుంటే సెల్ఫీ కూడా లేదు.. హృతిక్‌పై అభిమానుల ఆగ్రహం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)