Breaking News

నాలుగున్నరేళ్లుగా నటుడితో సహజీవనం.. మీరిక పెళ్లి చేసుకోరా?

Published on Wed, 06/07/2023 - 15:27

ప్రేమకు పెళ్లితో పనేంటి? అవును, మీరు విన్నది నిజమే.. ప్రేమకు పెళ్లితో పనేంటి? అంటున్నారు బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ అ‍ర్జున్‌ రాంపాల్‌- గాబ్రెల్లా డెమట్రేడ్స్‌. ప్రేమించుకున్నాం, మాకు నచ్చినట్లుగా కలిసి జీవిస్తున్నాం.. ఇంకేంకావాలి? పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అని ముందుకు సాగుతున్నారు. నాలుగున్నరేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంటకు ఓ బాబు సంతానం కాగా ప్రస్తుతం గాబ్రెల్లా రెండోసారి గర్భం దాల్చింది. అయితే పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తున్న ఈ జంటపై కొందరు నెటిజన్లు అదేపనిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో తనను టార్గెట్‌ చేసిన ఓ నెటిజన్‌కు చురకలేసింది నటి.

తాజాగా గాబ్రెల్లా వీకెండ్‌ అంటూ కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. ఇందులో ఆమె బేబీ బంప్‌ పిక్‌ కూడా ఉంది. ఇది చూసిన ఓ నెటిజన్‌.. 'మీరు ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? మీరు మీ దేశంలో లేరు ఇండియాలో ఉన్నారు. మీరిద్దరూ కలిసి యూత్‌ను చెడగొడుతున్నారు' అని కామెంట్‌ చేశాడు. దీనికి గాబ్రెల్లా స్పందిస్తూ.. 'అవును నిజమే, నీలాంటి మూర్ఖులకు బదులుగా అందమైన చిన్నారిని ఈ లోకంలోకి తీసుకువస్తుండటమే మేము చేసిన తప్పు' అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. 

కాగా అర్జున్‌ రాంపాల్‌ గతంలో మెహర్‌ జెసియాను పెళ్లి చేసుకున్నాడు. 1998లో భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ఆరంభించిన వీరిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2018లో విడిపోతున్నట్లు ప్రకటించారు. 2019లో విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది గాబ్రెల్లాను తన ప్రేయసి అంటూ అభిమానులకు పరిచయం చేశాడు, అది కూడా తను గర్భం దాల్చిందన్న వార్తతో!

చదవండి: పెళ్లి పీటలెక్కిన బాలీవుడ్‌ నటి, ఫోటోలు వైరల్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు