Breaking News

'అర్జున్ దాస్, శివాత్మిక'ల సినిమా ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌

Published on Thu, 10/09/2025 - 16:06

త‌మిళ న‌టుడు అర్జున్ దాస్, రాజ‌శేఖ‌ర్ కూతురు శివాత్మిక నటించిన 'బాంబ్‌' సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. విశాల్ వెంక‌ట్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం కోలీవుడ్‌లో సెప్టెంబర్‌ 12న విడుదలై మంచి విజయం సాధించింది. కాళి వెంక‌ట్, నాజ‌ర్, అభిరామి, సింగంపులి, బాల‌శ‌ర‌వ‌ణ‌న్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో  నటించారు. పాజిటివ్‌ టాక్స్‌తో రన్‌ అయిన ఈ మూవీకి 8.2 ఐఎండీబీ రేటింగ్‌తో గుర్తింపు పొందింది.

‘బాంబ్’ సినిమా ఏకంగా ఆరు ఓటీటీలలోకి రాబోతుంది. అమెజాన్‌ ప్రైమ్‌, ఆహా తమిళ్‌, సింప్తీ సౌత్‌, షార్ట్‌ఫ్లిక్స్‌, బ్లాక్‌షీప్‌, బ్రియో వంటి సంస్థలలో  అక్టోబర్‌ 10న విడుదల కానుంది.  అర్జున్ దాస్, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ సరికొత్త కథతో మెప్పించింది.

బాంబ్ సినిమా ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఉంటుంది. ఒకే గ్రామం  కాలపట్టి, కమ్మైపట్టి అనే రెండు చిన్న గ్రామాలుగా విడిపోయి గొడవలు పడుతుంటారు. ఆ గ్రామంలో దేవుణ్ని నమ్మని కతిరావన్ (కాళీ వెంకట్) అనుకోకుండా చనిపోతాడు. అయితే,  అతణ్ని రెండు గ్రామాల మధ్యలో ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చోబెడుతారు. కానీ మణిముత్తు (అర్జున్ దాస్) మాత్రం తన ఫ్రెండ్ కతిరావన్ చనిపోలేదని నమ్ముతాడు. కానీ, మిగిలిన వారందరూ అతడు చనిపోయాడనుకుని ఏడుస్తుంటే.. అత‌డు స‌డ‌న్‌గా అపానవాయువు(Fart) వ‌దులుతుంటాడు. దీంతో అత‌డు చ‌నిపోయాడా లేదా అనే ఆందోళనలో గ్రామస్థులు ఉంటారు. ఇంతకూ అతను చనిపోయాడా లేదా.. ఒకవేళ చ‌నిపోతే అలా ఎందుకు చేస్తున్నాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)