Breaking News

'జీవా, అర్జున్‌' థ్రిల్లర్‌ సినిమా.. అదిరిపోయే సాంగ్‌ రిలీజ్‌

Published on Sat, 01/25/2025 - 11:01

కోలీవుడ్‌ నటుడు జీవా, అర్జున్‌ సర్జా నటిస్తున్న తాజా చిత్రం అగత్యా నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రానుంది. జీవా నటించిన గత చిత్రం బ్లాక్‌ కూడా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు అగత్యా అనే సినిమాతో తమిళం, తెలుగు, హిందీ ప్రేక్షకులను ఆయన పలకరించనున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి 'నేలమ్మ తల్లి' అంటూ సాగే పాట విడుదలైంది. అయితే, ఈ సాంగ్‌లో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ను హైలెట్‌ చేస్తూ ఉంది.

వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేష్‌ నిర్మిస్తున్న ఈచిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్‌ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇందులో నటి రాశీఖన్నా నాయకిగా నటించగా యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది అద్భుతమైన సీజీ వర్క్‌తో భారీ బడ్జెట్‌ తో తెరకెక్కించిన హారర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం అని నిర్మాత ఐసరి గణేష్‌ ఇప్పటికే పేర్కొన్నారు. ఇందులో మన సంస్కృతి, మానవ అనుబంధాలు ఉంటాయని చెప్పారు. 

(ఇదీ చదవండి: విశాల్‌ ఆరోగ్యంపై తప్పుడు వ్యాఖ్యలు.. యూట్యూబర్స్‌పై కేసు నమోదు)
మార్వెల్‌ చిత్రాల తరహాలో ఒక కొత్త ప్రపంచాన్ని సష్టించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించాలన్నదే తమ భావన  అన్నారు. ఆ విధంగా వెర్సెస్‌ డెవిల్స్‌ అనే ఇతివత్తంతో రూపొందించిన చిత్రం ఇదన్నారు. అవేంజర్స్‌ తరహాలో ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ఊహాత్మక కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. అనీష్‌ అర్జున్‌ దేవ్‌కు చెందిన వామ్‌ ఇండియా సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు