Breaking News

సినిమా పరిశ్రమను కాపాడుకోవాలి : మంత్రి జి.వివేక్‌

Published on Fri, 10/10/2025 - 09:02

‘‘సినిమా వ్యాపారం అంటేనే రిస్క్‌. ‘అరి’ చిత్రంతో అలాంటి రిస్క్‌ చేశారు నిర్మాతలు. వారికి ఈ సినిమా మంచి విజయం అందివ్వాలి. తగినన్ని ప్రోత్సాహకాలు ఇస్తూ, సినిమా పరిశ్రమను కాపాడుకోవడంతో పాటు అభివృద్ధి చెందేలా చూసుకోవాలి. అప్పుడే స్థానికంగా ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలు వస్తాయి’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి జి. వివేక్‌ తెలిపారు.  వినోద్‌ వర్మ, అనసూయ, సాయికుమార్, శ్రీకాంత్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’. 

జయశంకర్‌ దర్శకత్వం వహించారు. రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్‌వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్‌ రామిరెడ్డి, డి. శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏషియన్‌–సురేష్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా నేడు రిలీజ్‌ అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘అరి’లాంటి మంచి చిత్రాలను ప్రోత్సహిస్తే ఈ కోవలో మరిన్ని సినిమాలు వస్తాయి’’ అని చెప్పారు. 

‘‘మంచి సందేశం ఇచ్చేలా రూపొందిన ‘అరి’ విజయం సాధించాలి’’ అని ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఆకాంక్షించారు. ‘‘మంచి కథతో ఈ చిత్రాన్ని రూ΄÷ందించారు జయశంకర్‌’’ అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌. ‘‘అరిషడ్వర్గాల నేపథ్యంలో తీసిన ‘అరి’కి మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం’’ అని తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శ్రీనివాస్‌ రామిరెడ్డి తెలి΄ారు. ‘‘నా 50 ఏళ్ల నట జీవితంలో ‘అరి’ లాంటి చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నాను’’ అని నటుడు సాయికుమార్‌ చె΄్పారు. ఈ వేడుకలో దర్శకుడు జయశంకర్, త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌ స్వామి, తెలంగాణ స్టేట్‌ ΄్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ చైర్మన్‌ జి. చిన్నారెడ్డి తదితరులు మాట్లాడారు.   

Videos

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)