Breaking News

సిగరెట్‌, మందు.. అమ్మో.. మా నాన్న చాలా స్ట్రిక్టు!

Published on Wed, 06/12/2024 - 13:33

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్తున్నా సరే జనాలు వాటిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. సాధారణ జనాల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమందికి ఈ రెండింటిలో ఏదో ఒక అలవాటు ఉండే ఉంటుంది. సరదాకనో, ఒత్తిడిగా ఉందనో సిగరెట్‌, మందుకు బానిసగా మారుతుంటారు. అయితే నటుడు అపరశక్తి ఖురానా మాత్రం తనకీ అలవాటే లేదంటున్నాడు.

పార్టీలు చేసుకోండి
వీజే సైరస్‌ బ్రోచా నిర్వహించే 'సైరస్‌ సేస్‌' అనే పాడ్‌కాస్ట్‌లో అపరశక్తి ఖురానా మాట్లాడుతూ.. 'మా నాన్న చాలా స్ట్రిక్ట్‌. తన వల్లే నేను, నా సోదరుడు (ఆయుష్మాన్‌ ఖురానా) ఇంతవరకు సిగరెట్‌, మందు జోలికి వెళ్లలేదు. ఆయన ఏం అనేవారంటే.. మీరు బయటకు వెళ్లాలనుకుంటే వెళ్లండి, పార్టీలు చేసుకోండి. కానీ ఇంటికి మాత్రం తిరిగి రావద్దు. ఎవరో ఒకరి ఇంట్లో తలదాచుకోండి..  కనీసం నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరింట్లో ఉన్నారనేది నేను లెక్క చేయను. నాకే సమస్యా లేదు. 

నా చేతిలో ఉంటది..
కానీ.. మీరు సిగరెట్‌, మందు తాగారని తెలిస్తే మాత్రం నా చేతిలో మీకు మూడినట్లే! అని బెదిరించాడు. అందుకే మేమింతవరకు దాని జోలికే వెళ్లలేదు. పైగా తను జ్యోతిష్యుడు. మేము తాగితే తనకు ఇట్టే తెలిసిపోతుందన్న భయముండేది. ఆ కారణం వల్ల అటువైపు వెళ్లలేదు. అయితే ఓ వయసొచ్చాక వాటి మీద ఆసక్తి కూడా ఉండదు' అని చెప్పుకొచ్చాడు. కాగా అపరశక్తి ఖురానా తండ్రి పి.ఖురానా 2023 మే 19న మరణించాడు.

చదవండి: స్టార్ హీరోయిన్ వల్ల ఆగిపోయిన అభిమాని పెళ్లి

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)