Breaking News

AP Assembly Election 2024: ఎన్టీఆర్‌ షర్ట్‌పై నెట్టింట రచ్చ!

Published on Mon, 05/13/2024 - 09:55

సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఏది ఎలా వైరల్‌ అవుతుందో చెప్పలేం. తాజాగా ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ ఎన్టీఆర్‌ షర్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ 42 లోక్‌ సభ స్థానాలకు  ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభమైంది. హీరో ఎన్టీఆర్‌ ఉదయమే తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లో ఓబుల్‌రెడ్డి స్కూల్లో భార్య ప్రణతి, తల్లి షాలిని కలిసి వెళ్లి, సామాన్యుడిలా క్యూలో నిలబడి మరీ ఓటు వేశారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఎన్టీఆర్‌ పేరు నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. దీనికి కారణంగా పోలింగ్‌కి ఆయన వేసుకొచ్చి చొక్కానే. ఆయన బ్లూ షర్ట్‌ ధరించి పోలింగ్‌ కేంద్రానికి వచ్చాడు. దీంతో ఎన్టీఆర్‌ పరోక్షంగా వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. తమకు మద్దతుగానే ఎన్టీఆర్‌ బ్లూషర్ట్‌ వేసుకొచ్చాడంటూ వైఎస్సార్‌సీపీ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఎన్టీఆర్‌ ఫోటోని  వైరల్‌ చేస్తున్నారు. 

కాగా, ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ తన కుటుంబ పార్టీ అయిన టీడీపీతో పాటు ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు.  నందమూరి ఫ్యామిలీకి చంద్రబాబు చేసిన మోసాలను తెలుసుకొనే ఎన్టీఆర్‌ పార్టీకి దూరమైనట్లు తెలుస్తోంది. లోకేష్‌ కోసమే చంద్రబాబు నందమూరి ఫ్యామిలీ సభ్యులను పార్టీలో ఎదగకుండా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఎన్టీఆర్‌ స్నేహితులు కొడాలి నాని, వంశీ వైఎస్సార్‌సీపీ పార్టీలో ఉన్నారు. అయితే ఎన్టీఆర్‌ మాత్రం ఈ ఎన్నికల్లో ప్రత్యేక్షంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా.. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగానే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)