Breaking News

ఓటీటీలో రొమాంటిక్‌ సినిమా.. రూ. 1900 కోట్ల కలెక్షన్స్‌తో రికార్డ్‌

Published on Mon, 04/21/2025 - 09:32

రెండేళ్ల క్రితం హాలీవుడ్‌లో సంచలన విజయాన్ని అందకున్న చిత్రం ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేసింది. అయితే, ఇప్పుడు ఉచితంగానే స్ట్రీమింగ్‌ అవుతుంది. 2023లో విడుదలైన 'ఎనీవన్ బట్ యూ'  ఇప్పటికే పలు ఓటీటీలలో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు సోనీలివ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. అమెరికన్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా ప్రముఖ దర్శకుడు విల్ గ్లక్ తెరకెక్కించారు. విలియం షేక్స్పియర్ రచించిన మచ్ అడో అబౌట్ నథింగ్ ఆధారంగా ఈ సినిమా స్టోరీని తీసుకున్నారు. ఇందులో సిడ్నీ స్వీనీ , గ్లెన్ పావెల్ జోడి చాలా రొమాంటిక్‌గా నటించారు.

ఆ ఏడాదిలో విడుదలైన అన్ని హాలీవుడ్‌ చిత్రాల్లో 'ఎనీవన్ బట్ యూ' టాప్‌లో రన్‌ అయింది. ఆపై  ఓటీటీలోనూ ఈ చిత్రానికి భారీగానే వ్యూస్ దక్కాయి. సబ్‌టైటిల్స్‌తో ఉన్న ఈ మూవీ ఇంగ్లీష్‌లో ఉంది. ప్రస్తుతం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అదికూడా  ఉచితంగానే చూసేయవచ్చు. అయితే, జీ5,అమెజాన్‌ ప్రైమ్‌లో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది. కానీ అక్కడ రెంటల్‌ విధానంలో ఉంది. సుమారు ఏడాది పాటు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ చిత్రం రన్‌ అయింది. ఢీల్‌ పూర్తి కావడంతో తాజాగా అందులో నుంచి తొలగించారు.

రూ. 210 కోట్ల బడ్జెట్‌
'ఎనీవన్ బట్ యూ' చిత్రాన్ని రూ. 210 కోట్ల బడ్జెట్‌తో విల్ గ్లక్, జో రోత్, జెఫ్ కిర్షెన్‌బామ్ సంయుక్తంగా నిర్మించారు. కేవలం 103 నిమిషాలు మాత్రమే ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 1900 కోట్ల కలెక్షన్స్‌ సాధించి రికార్డ్ క్రియేట్‌ చేసింది. ఈ సినిమాను కోలంబియా పిక్చర్స్, ఓలివ్ బ్రిడ్జ్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్లు నిర్మించాయి. అయితే, సోనీ పిక్చర్స్‌ విడుదల చేసింది. డేటింగ్‌ కోసం వెళ్లిన ఇద్దరు ప్రేమికులు చిన్న కారణంతో విడిపోయి.. ఒక పెళ్లిలో మళ్లీ కలుస్తారు. ఆ వేడుకను చూసి వారిలో ఎలాంటి ఆలోచన వచ్చింది అనేది ఈ సినిమా ప్రధాన కాన్సెప్ట్‌. చాలా రొమాంటిక్‌గా, కామెడీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
 

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)