Breaking News

అప్పుడు చాలా బాధపడ్డా..ఇప్పుడు గర్వంగా ఉంది: నటి అనుశ్రీ

Published on Sun, 01/25/2026 - 11:02

అభినవ శౌర్య, అనుశ్రీ హీరో హీరోయిన్లుగా, రఘు కుంచె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘దేవగుడి’. బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అభినవ్‌ శౌర్య మాట్లాడుతూ– ‘‘చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తే, మాలాంటి కొత్త టాలెంట్‌ బయటకొస్తుంది’’ అన్నారు. 

‘‘నిజజీవిత సంఘటన ఆధారంగా షార్ప్‌ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా తీశాం. స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఈ సినిమాలోని ప్రధానాంశాలు. మా సినిమా ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుంది’’ అని చెప్పారు బెల్లం రామకృష్ణా రెడ్డి. ‘‘నటుడిగా నా కెరీర్‌లో ఎప్పుడూ చేయనటువంటి యాక్షన్‌ సీక్వెన్స్‌ను ఈ సినిమా కోసం చేశాను’’ అని తెలిపారు రఘు కుంచె. 

‘‘అమ్మాయి సినీ ఇండస్ట్రీలోకి వస్తే ఎంత నెగటివ్‌గా మాట్లాడతారో తెలుసు. నేనీ సినిమా చేస్తున్నప్పుడు అలా నెగటివ్‌గా మాట్లాడినవారే, ఇప్పుడు తమ ఇంటికి ఆహ్వానిస్తున్నారు. ఒకప్పుడు బాధపడిన నేను ఇప్పుడు గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నాను’’ అన్నారు అనుశ్రీ. సంగీతదర్శకుడు ఎస్కే మదీన్, ఛాయాగ్రాహకుడు లక్ష్మీకాంత్‌ కనిక మాట్లాడారు. 

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)