Breaking News

అదృష్ట అందగత్తెలు

Published on Sat, 04/29/2023 - 10:59

ఎందరో అందగత్తెలు,అందులో కొందరు మాత్రమే లక్కీ అనిపించుకుంటున్నారు. అందుకు కారణం వరస విజయాలు. ఒక దాని తర్వాత మరో దానితో మూడు విజయాలు అందుకోని గోల్డెన్ లెగ్ అనిపించుకున్నారు. హ్యాట్రిక్ సక్సెస్లను ఖాతాలో వేసుకున్నారు.ఇంతకీ ఆపకుండా హిట్లు చూస్తున్న ఆ భామలు ఎవరు?

సంయుక్త మీనన్‌ లక్కీ హ్యాండ్ అనకుండా ఉంటారా ? ఒకటి కాదు రెండు కాదు వరసగా నాలుగు విజయాలు.అవి కూడా అలాంటి ఇలాంటివి కాదు బ్లాక్ బస్టర్లు.ఈమె నటించిన హీరోలందరికి కెరీర్ బెస్ట్ విజయాలు ఇచ్చేసింది. అదెంటీ సంయుక్త కారణంగా హీరోలకు విజయాలు వస్తున్నాయా అంటే ఆమె లెగ్ మహిమ అలా ఉంది మరి. గోల్డెన్ లెగ్ పెడితే సక్సెస్‌లు రాకుండా ఉంటాయా ?అందంతో పాటు అభినయంతో కూడా కట్టిపడేస్తుంది ఈ బ్యూటీఫుల్ తార.

ధనుష్ మొదటి సారి తెలుగులో నటించిన సార్ మూవీ బిగ్ హిట్. తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా విజయం సాధించింది. ఇందులో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటించింది. బహుశ ఈ బ్యూటీ అదృష్టమే ధనుష్‌కి కలిసి వచ్చిందేమో. సినిమా బిగ్ హిట్ అవటమే అందుకు సాక్ష్యం. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా ప్రపంచవ్యాప్తంగా వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది

సంయుక్త మీనన్ అదృష్ణాన్ని సమిక్ష్మించే మరో ఉదాహరణ బింబిసార. 2015 లో పటాస్‌తో చక్కని విజయం చూసాడు కళ్యాణ్ రామ్.తర్వాత విజయం అందని ద్రాక్షల మారింది. మళ్లీ  2022 లో బింబిసారతో విజయం దక్కింది. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది.

విరూపాక్ష సాలిడ్ వసూళ్లు రాబడుతుంది.సాయితేజ్ కెరీర్లోనే భారీ హిట్ కొట్టింది. విలేజ్ హర్రర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో సంయుక్త మీనన్ కథానాయిక. అంతేకాదు  మూవీ స్టోరీ కూడా ఈ బ్యూటీ క్యారెక్టర్ చుట్టునే తిరిగుతుంది. గ్లామర్ ఒలకబోస్తునే,అభినయంతో కూడా కట్టి పడేసేంది.అందంతో ఆకట్టుకుంటునే నెగిటివ్ రోల్‌లో మెస్మరైజ్ చేసింది

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా కృతి శెట్టిని ఓవర్ నైట్ స్టార్‌ని చేసేసింది. అందాల కనువిందు చేయటానికి ఎందరో బ్యూటీలు రెడీగా ఉన్నారు అయితే అభినయంతో ఆకట్టుకుంటున్న కృతీ వైపు అదృష్టం ఉంది. అందుకే ఉప్పెనంత విజయాలతో దూసుకుపోతుంది. హ్యాట్రిక్ విజయాలతో సత్తా చూపించింది

(చదవండి: ఆ హీరోతో డేటింగ్‌ చేస్తోందని బాధపడ్డ మరో హీరో.. హర్టయిన నటి!)

ఉప్పెన కృతి శెట్టికి మొదటి సినిమా. కుర్రాళ్ల గుండెల్ని ధక్ ధక్ మనేలా చేసింది కృతి అందం. తొలి సినిమాతోనే రూ. 100 కోట్ల కలె​క్షన్స్‌ క్లబ్‌లో చేరింది. ఉప్పెన విజయంతో యంగ్‌ హీరోలతో జోడి కట్టే అవకాశం దక్కించుకుంది కృతి శెట్టి. రెండో సినిమాలో నాచురల్ స్టార్ నానితో ఆడిపాడింది. శ్యామ్ సింగరాయ్ టైటిల్‌తో వచ్చిన ఈ మూవీ విజయం సాధించింది. ఈ మూవీలో పక్కింటి అమ్మాయిలా కనిపించి, ఆడియన్స్ మనసు గెలుచుకుంది.

(చదవండి: సౌత్‌ వర్సెస్‌ బాలీవుడ్‌.. ఐశ్వర్యరాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు)

కృతి శెట్టి మూడో సినిమా బంగార్రాజు. నాగార్జున నాగ చైతన్య కలిసి నటించారు. చైతూ గర్ల్ ఫ్రెండ్‌గా యాక్ట్ చేసింది. బంగార్రాజు కూడా విజయం సాధింది కృతికి హ్యాట్రిక్ విజయం అందించింది. ఇప్పుడు మరోసారి చైతూతో జోడి కట్టింది .కస్టడీ మూవీలో రొమాన్స్ చేసింది. తొందర్లో సినిమా థియేటర్లలోకి రాబోతుంది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించింది .తర్వాత పెద్ద సినిమాలలో నటించే స్థాయికి ఎదిగింది.బిగ్‌ హీరోయిన్‌గా మారిపోయింది.నాన్నకు ప్రేమతో, సరైనోడు, దృవ లాంటి సినిమాలతో వరసగా మూడు విజయాలు అందుకున్న హీరోయిన్ల లిస్ట్‌లోకి చేరింది.

అందాల తార అనుష్క కథే వేరు. అరుందతికి ముందు ఈ సినిమా తర్వాత అన్నట్టుగా సాగింది ఈ బ్యూటీ కెరీర్‌ .బాక్సాఫీసు ముందర అరుందతి భారీ హిట్‌ కొట్టింది. అప్పటి వరకు గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన జేజెమ్మ అరుందతి తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలలో కూడా నటించింది. ఇక ఈమె కూడా వరస హిట్లు కొట్టిన భామల లిస్ట్‌లో ఉంది.

నివేథా థామస్‌ తెలుగులో నటించిన మొదటి సినిమా జెంటల్‌ మెన్. ఫస్ట్‌ సినిమాతోనే అభినయానికి కూడా మార్కులు వేసుకుంది నివేథా. తర్వాత నిన్ను కోరి. జై లవ కుశ అంటు మరో రెండు విజయాలను ఖాతాలో వేసుకుంది. ఇలా కెరీర్‌ మొదట్లోనే హ్యాట్రిక్‌ కొట్టి  తక్కువ మంది తారలు మాత్రమే సాధించే ఫీట్‌ అందుకుంది

వరస విజయాలు రావటం అంత ఈజీ మ్యాటర్‌ కాదు. ఓ నాయికకు అలా విజయాలు వచ్చాయి అంటే కెరీర్‌ దూసుకుపోతుంది అని అర్థం.అసలే సెంటిమెంట్లను బాగా నమ్మే ఫిల్మ్‌ ఇండస్ట్రీలో విజయవంతమైన సినిమాలలో నటించే అవకాశం రావటం అదృష్టమే అని చెప్పాలి.

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)