Breaking News

ఘాటీ వాయిదా

Published on Sun, 07/06/2025 - 04:10

‘‘సినిమా అనేది జీవనది లాంటిది. కొన్నిసార్లు అది వేగంగా ముందుకు వెళుతుంది. కొన్నిసార్లు లోతు పెంచుకోవడానికి ఆగుతుంది. ‘ఘాటీ’ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు... అది పర్వతాల ప్రతిధ్వని, అడవిలోని చల్లటి గాలి. మట్టి నుంచి, రాతి నుంచి చెక్కిన కథ. ప్రతి ఫ్రేమ్‌ని అద్భుతంగా ఆవిష్కరించడం కోసం మేం మరికొంత సమయం వెచ్చించాలనుకున్నాం’’ అని ‘ఘాటీ’ చిత్రబృందం ఓ లేఖ విడుదల చేసింది. అనుష్క లీడ్‌ రోల్‌లో క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన చిత్రం ‘ఘాటీ’.

ఈ నెల 11న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. అయితే వాయిదా వేసినట్లు పేర్కొని, శనివారం ఓ లేఖ విడుదల చేశారు. ‘‘మా సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకుల నిరీక్షణకు తగ్గట్టు ఓ అద్భుతమైన, ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి దక్కుతుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. బాధితురాలైన ఓ మహిళ పగ తీర్చుకునే క్రమంలో నేరస్థురాలిగా ఎలా మారింది? ఆ తర్వాత ఎలా లెజెండ్‌ అయింది? అనేది ‘ఘాటీ’ చిత్రం ప్రధానాంశం. విజువల్‌ ఎఫెక్ట్స్‌కిప్రాధాన్యం ఉన్న చిత్రం కావడంతో, ఆ పనులు పూర్తి కాకపోవడం వల్లే రిలీజ్‌ను వాయిదా వేశారట.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)