Breaking News

Anushka Sen: బాల నటిగా.. మోడల్‌గా.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా..

Published on Sun, 06/30/2024 - 01:04

అనుష్కా సేన్‌.. టీవీ.. సినిమా.. ఓటీటీ స్క్రీన్స్‌కి న్యూ ఫేస్‌ కాదు.. గ్లామర్‌ ఫీల్డ్‌కి న్యూ నేమ్‌ కాదు. ఆ ఫేమ్‌ కూడా ఆమెకు కొత్త కాదు. బాల నటిగా.. మోడల్‌గా.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చిన్న వయసులోనే ఎంతో ఘనతను సాధించేసింది.

  • అనుష్కా పుట్టింది రాంచీ (జార్ఖండ్‌)లో. పెరిగింది ముంబైలో. నాన్న.. అనిర్వాణ్‌ సేన్, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌. అమ్మ.. రాజ్‌రూపా సేన్, గృహిణి. కూతురి ఉన్నతి వెనుకున్నది ఆ ఇద్దరే! అనుష్కా ప్రస్తుతం.. సినిమాటోగ్రఫీలో డిగ్రీ చదువుతోంది.

  • చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా జీటీవీ ‘యహా మై ఘర్‌ ఘర్‌ ఖేలీ’ అనే సీరియల్‌తో పరిచయం అయింది. ‘దేవోంకా దేవ్‌ మహాదేవ్‌’లో బాల పార్వతి, ‘బాల్‌ వీర్‌’లో మెహెర్‌ పాత్రతో పాపులర్‌ అయింది. తర్వాత క్రికెటర్‌ ధోనీతో కలసి చేసిన ఒక కమర్షియల్‌ యాడ్‌తో మరింత ఫేమస్‌ అయింది. అంతేకాదు ఆ యాడ్‌తో ధోనీకి ఆమెకూ మధ్య చిక్కీ అండ్‌ చాచూ (చిక్కీ అండ్‌ బాబాయ్‌)గా అనుబంధమూ బలపడింది.

  • చైల్డ్‌ ఆర్టిస్ట్‌గానే అనుష్కా ‘క్రేజీ కుక్కడ్‌ ఫ్యామిలీ’తో బాలీవుడ్‌లోకి ఎంటర్‌ అయింది. దాని తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని చదువు మీద శ్రద్ధ పెట్టింది. 2018లో ‘ఇంటర్నెట్‌ వాలా లవ్‌’తో మళ్లీ బుల్లితెర మీద కనిపించసాగింది. యంగ్‌ ఆర్టిస్ట్‌గా అనుష్కాకు కీర్తి సంపాదించిపెట్టిన సీరియల్‌ ‘ఝాన్సీ కీ రాణీ’. అందులో ఆమెది టైటిల్‌ రోల్‌!  ‘లిహాఫ్‌ .. ద క్విల్ట్‌’ అనే సినిమాలో అనుష్కా సేన్‌ యుక్తవయసు ఇస్మత్‌ చుగ్తాయ్‌గా నటించింది. అది ఆమెకు మంచి నటిగా గుర్తింపునిచ్చింది.

  • ఓ వైపు సీరియళ్లు, సినిమాలు చేస్తూనే ఇంకో వైపు వీడియో ఆల్బమ్స్‌లోనూ తన అభినయ కళను చాటసాగింది. ఇటు ఓటీటీ అవకాశాలూ వరుసకట్టాయి. అలా ‘క్రాష్‌’, ‘స్వాంగ్‌’ సిరీస్‌లలో నటించింది. తాజాగా ‘దిల్‌ దోస్తీ డైలమా’లోనూ ప్రధాన భూమిక పోషించింది. అందులోని ఆమె నటన అభిమానులవే కాదు విమర్శకుల ప్రశంసలూ అందుకుంటోంది. ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.

  • అనుష్కా సినిమాలు, సీరియళ్లు, సిరీస్‌లకే కాదు సోషల్‌ మీడియా పోస్ట్‌లకూ వీర ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. లక్షల్లో సబ్‌స్క్రైబర్స్, కోట్లలో ఫాలోవర్స్‌తో చిన్నవయసులోనే  సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా  మారింది. ఈ పాపులారిటే ఆమెకు కొరియన్‌ సినిమా చాన్స్‌నూ తెచ్చిపెట్టింది. అలా అనుష్కా ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌ అయిపోయింది.

కొరియన్‌ డ్రామాస్‌ అంటే కళ్లింత చేసుకుంటా. అలాంటి నాకు కొరియన్‌ మూవీలో చాన్స్‌ వచ్చిందని తెలియగానే క్లౌడ్‌ 9లో తేలిపోయా! ఇదంతా నా అభిమానుల బ్లెస్సింగ్స్‌ వల్లే పాజిబుల్‌ అయిందని నమ్ముతా! ఫ్యాన్సే నా సైన్యం! సోషల్‌ మీడియాలో వాళ్లతో ఇంటరాక్ట్‌ అయినప్పుడల్లా పాజిటివ్‌ ఎనర్జీతో చార్జ్‌ అవుతాను. కాన్ఫిడెంట్‌గా ఫీలవుతాను! – అనుష్కా సేన్‌

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)