Breaking News

అతని సాయం వల్లే నా కూతురి పెళ్లి చేశాను: స్టార్‌ డైరెక్టర్‌

Published on Mon, 05/12/2025 - 09:38

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌( Anurag Kashyap) నటుడిగానూ వెండితెరపై మెప్పిస్తున్నాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తనకు ఎంతో పెరు తెచ్చిన మహారాజ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఎన్నో హిట్‌ సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ రాని పేరు మహారాజ( Maharaja) సినిమాతో వచ్చిందన్నాడు. విజయ్‌ సేతుపతి( Vijay Sethupathi) చెప్పడం వల్లే తనకు ఈ చిత్రంలో అవకాశం వచ్చిందని గుర్తుచేసుకున్నారు. మూవీ విడుదలైన తర్వాత తనకు అవకాశాలు పెరిగాయన్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బు వచ్చిందని, దాంతోనే తన కూమార్తె పెళ్లి చేశానని ఆయన పేర్కొన్నారు.

విజయ్‌ సేతుపతి గురించి అనురాగ్‌ కశ్యప్‌ ఇలా చెప్పారు. 'దక్షణాది నుంచి నాకు చాలా సినిమా ఆఫర్స్‌ వచ్చాయి. కానీ, నాకు యాక్టింగ్‌పై పెద్దగా ఆసక్తి లేదు. దీంతో వాటిని వదులుకున్నాను. అయితే, నేను డైరెక్ట్‌ చేసిని కెన్నెడీ చిత్రం పనుల్లో భాగంగా విజయ్‌ సేతుపతిని కలిశాను. ఆ మూవీ గురించి ఆయన ద్వారా కొన్ని సలహాలు తీసుకున్నాను. అలా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే నా కుమార్తె పెళ్లి గురించి ఆయనతో చెబుతూ.. వివాహం కోసం కావాల్సినంత డబ్బులేదన్నాను. క్షణం ఆలస్యం లేకుండా సాయం చేస్తానని మాట ఇచ్చారు. 

అప్పుడే మా ఇద్దరి మధ్య మహారాజు సినిమా గురించి చర్చ వచ్చింది. అందులోని రోల్‌ కోసం గతంలోనే నన్ను సంప్రదించాలని అనుకున్నట్లు తెలిపారు. మొదట ఆ సినిమాలో నటించలేనని చెప్పాను. కానీ, విజయ్‌ సేతుపతి చెప్పడం వల్లే ఓకే అనేశాను. అలా వచ్చిన డబ్బుతోనే నా కూతురి పెళ్లి చేశాను. ఆ సమయంలో విజయ్‌ నాకెంతో సాయం చేశారు. మహారాజ తర్వాత నాకు చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. 2028 వరకు నా డేట్స్‌ ఖాళీగా లేవు. ఇదంతా విజయ్‌ సేతుపతి వల్లే అని' అనురాగ్‌ కశ్యప్‌ తెలిపారు.

గతేడాదిలో విడుదలైన ‘మహారాజ’ చిత్రంలో నెగటివ్‌ పాత్రలో అనురాగ్‌ కశ్యప్‌ నటించారు.  నిథిలన్‌ స్వామినాథన్‌ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అనురాగ్‌ కశ్యప్‌.. రైఫిల్‌ చిత్రంతో పాటు  డకాయిట్‌ సహా పలు సినిమాలు చేస్తున్నాడు. డైరెక్టర్‌గా ఆయన చేతిలో ఐదు సౌత్‌ చిత్రాలు ఉన్నాయి. అందుకే ఆయన రీసెంట్‌గా బాలీవుడ్‌ వదిలేసి పూర్తిగా ఇక్కడే స్థిరపడిపోయాడు.

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)