Breaking News

ఓటీటీకి అనుపమ కోర్ట్ థ్రిల్లర్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Mon, 08/04/2025 - 22:01

అనుపమ పరమేశ్వరన్ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. ఈ మూవీ రిలీజ్‌కు ముందే వివాదానికి దారితీసింది. సినిమా టైటిల్‌లో జానకి పేరు ఉపయోగించడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవికి మరో పేరైన జానకి టైటిల్ మారిస్తేనే సెన్సార్ చేస్తామని నిర్మాతలకు సూచించింది. ఆ తర్వాత జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా పేరును మార్చారు. దీంతో సెన్సార్ బోర్డ్‌ విడుదలకు ఓకే చెప్పింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు సురేశ్ గోపి ప్రధాన పాత్రలో నటించారు.

కోర్టు రూమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా జూలై 17న థియేటర్లలోకి రిలీజైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో కేవలం మలయాళంలోనే విడుదలైన ఈ సినిమా.. ఆగస్టు 15 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

జానకి.వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ..

సిటీలో ఉద్యోగం చేసుకునే అమ్మాయి జానకి(అనుపమ). ఓ రోజు ఆమెపై అత్యాచారం జరుగుతుంది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆరోపణలతో ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫున వాదించేందుకు లాయర్(సురేశ్ గోపి) వస్తాడు. దీంతో కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. చివరకు జానకికి న్యాయం దక్కిందా లేదా అనేదే ‍అసలు స్టోరీ.

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)