Breaking News

నన్ను ఇంతలా ఎవరు టార్చర్ చేయలేదు.. అనుపమ ఆసక్తికర కామెంట్స్

Published on Wed, 09/03/2025 - 20:24

ఇటీవలే పరదా మూవీతో అలరించిన అనుపమ పరమేశ్వరన్‌ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె హీరోయిన్‌గా నటించిన హారర్ మూవీ కిష్కింధపురి. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

రిలీజ్‌ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే కిష్కింధపురి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు అనుపమ పరమేశ్వరన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హారర్ ఫిల్మ్స్‌ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. నా జుట్టును చూసే ఇలాంటి సినిమాలు వచ్చాయని అనుపమ నవ్వుతూ మాట్లాడింది.

అనుపమ మాట్లాడుతూ..'నాకు హారర్ జోనర్ సినిమాలంటే ఇష్టం. నా మూడేళ్ల వయసు నుంచే హారర్ మూవీస్ చూశా. నా జుట్టు చూసే ఈ అవకాశాలు వచ్చాయి అనుకుంటా. కౌశిక్ నాకు కథ చెప్పగానే చాలా నచ్చింది. అతను చెప్పిన ఫ్లో నాకు నచ్చింది. కౌశిక్‌తో పని చేయడం అద్భుతంగా అనిపించింది. స్క్రిప్ట్‌పై ఫుల్ క్లారిటీ ఉన్న వ్యక్తి. డబ్బింగ్‌ స్టూడియోలో ఇంతలా నన్ను టార్చర్‌ చేసిన తెలుగు డైరెక్టర్ మరెవరూ లేరంటూ' నవ్వుతూ చెప్పారు. కాగా.. ఈ సినిమాకు కౌశిక్ పెగళ్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీ సెప్టెంబర్‌ 12న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)