సంతానం లేనందుకు బాధగా అనిపిస్తుంది: అనుపమ్‌ ఖేర్‌

Published on Mon, 10/21/2024 - 17:49

చాలామంది పనిలో పడి వ్యక్తిగత జీవితాన్నే మర్చిపోతుంటారు. అలా ఏళ్లకు ఏళ్లే గడిచిపోతాయి. కానీ వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు ఎన్నో కోల్పోయామని బాధపడుతుంటారు. బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ పరిస్థితి కూడా ఇంతే! ప్రస్తుతం ఈయన వయసు 69 ఏళ్లు.. ఇన్నేళ్లుగా కెరీర్‌లోనే మునిగిపోయిన ఆయన తనకంటూ కన్నకొడుకు ఉంటే బాగుండని అంటున్నాడు.

ఇద్దరికీ రెండో పెళ్లి
కాగా అనుపమ్‌.. 1979లో నటి మధుమాలతిని పెళ్లి చేసుకోగాకొన్నేళ్లకే విడిపోయారు. 1985లో కిరణ్‌ ఖేర్‌ను పెళ్లాడాడు. కిరణ్‌కు కూడా ఇది రెండో పెళ్లి! గతంలో ఆమె బిజినెస్‌మెన్‌ గౌతమ్‌ను పెళ్లాడగా వీరికి సికిందర్‌ అనే కుమారుడు జన్మించాడు. తర్వాత భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావడంతో అతడికి విడాకులిచ్చేసి 1985లో అనుపమ్‌ను పెళ్లాడింది. అయితే వీరికి సంతానం లేదు.

ఆ అనురాగం వేరే..
తాజాగా అనుపమ్‌ మాట్లాడుతూ.. అంతకుముందు పట్టించుకునేవాడిని కాదు కానీ కొన్నిసార్లు బాధేస్తుంటుంది. నాకూ ఓ కొడుకో, కూతురో ఉంటే బాగుండేదని  ఏడెనిమిదేళ్లలో ఎన్నోసార్లు అనుకున్నాను. అలా అని సికిందర్‌తో సంతోషంగా లేనని కాదు. కానీ ఓ కొడుకు పుట్టుంటే.. వాడు కళ్ల ముందు పెరుగుతూ ఉంటే ఆ సంతోషం, అనురాగమే వేరేలా ఉండేది. మాకు సంతానం ఉండుంటే ఎంత బాగుండో అని అనుకుంటూ ఉంటాను.

(చదవండి: నాన్న ఏడుస్తుంటే ఫోటోలు తీశారు, దారుణం: కిచ్చా సుదీప్‌ కూతురు)

50 ఏళ్లు దాటినప్పటి నుంచి..
నేను పనిలో మునిగిపోయి కొన్నేండ్లపాటు దీని గురించే ఆలోచించలేదు. ఎప్పుడైతే 50-55 ఏళ్ల వయసు వచ్చిందో అప్పటినుంచే ఏదో వెలితిగా అనిపిస్తోంది. ద అనుపమ్‌ ఖేర్‌ ఫౌండేషన్‌లో పిల్లలతో కలిసి పని చేస్తుంటాను. అలాగే నా స్నేహితుల పిల్లలను చూసినప్పుడు కూడా నాకు పిల్లలు లేరు అని ఫీలవుతాను అని చెప్పుకొచ్చాడు.

బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)