'తన్వి ది గ్రేట్‌' సినిమా వీక్షించిన రాష్ట్రపతి

Published on Sat, 07/12/2025 - 12:03

తన్వి ది గ్రేట్ (Tanvi The Great) అనే చిత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) వీక్షించారు. చిత్ర యూనిట్‌తో కలిసి రాష్ట్రపతి భవన్‌లో ఈ సినిమాను ఆమె చూశారు. అనంతరం వారిని అభినందించారు. భారత సాయుధ దళాల ధైర్యం, త్యాగాలకు నివాళిగా ‘తన్వి ది గ్రేట్‌’ చిత్రాన్ని అనుపమ్‌ ఖేర్‌ (Anupam Kher)  తెరకెక్కించారు. శుభాంగి దత్ టైటిల్ పాత్రలో నటించింది. ట్రైలర్‌లోనే ఆమె నటనతో అందరినీ మెప్పించింది. జులై 18న ఈ చిత్రం విడుదల కానుంది. 

ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. ఒక ఆర్మీ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆటిజం అనే అడ్డంకిని అధిగమించి ఆర్మీలో చేరాలనే కలను ఎలా నెరవేర్చిందన్నదే ఈ కథ ప్రధాన కథాంశం. 2002లో వచ్చిన 'ఓం జై జగదీష్‌' సినిమా తర్వాత మళ్లీ ‘తన్వి ది గ్రేట్‌’ చిత్రానికి అనుపమ్‌ ఖేర్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, అరవింద స్వామి, బొమన్‌ ఇరానీ, పల్లవి జోషి, నాజర్‌ వంటి స్టార్‌ నటులు ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎన్‌ఎఫ్‌డీసీతో కలిసి అనుపమ్‌ స్టూడియోస్‌ నిర్మించింది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)